ఎమ్మెల్యేను అడ్డుకున్న ఘటనలో 30 మందిపై కేసు
ABN, First Publish Date - 2023-05-01T23:45:13+05:30
మండలంలోని ఈదులబళాపురం పంచాయతీ రేణుకానగర్ వద్ద సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కా ర్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్‌నారాయణను అడ్డుకున్న ఘటనలో 30మందిపై కేసు నమోదైంది.
సోమందేపల్లి, మే 1: మండలంలోని ఈదులబళాపురం పంచాయతీ రేణుకానగర్ వద్ద సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కా ర్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్‌నారాయణను అడ్డుకున్న ఘటనలో 30మందిపై కేసు నమోదైంది. ఈమేరకు ఇనచార్జి ఎస్‌ఐ వెంకటరమణ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గ్రామంలోకి వె ళ్తుండగా వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాగభూషణంరెడ్డి ఆ ధ్వర్యంలో పలువురు అడ్డుకున్నారన్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వా తావరణం నెలకొంది. ఈ సంఘటనలో ఎమ్మెల్యేను అడ్డుకున్న వారిని పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు నాగభూషణంతోపాటు మ రో 29 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో చాలా మంది అధికార వైసీపీకి చెందినవారే కావడం విశేషం.
వైసీపీ నుంచి నాగభూషణం సస్పెన్షన?
పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణను గ్రామంలోకి రాకుండా అ డ్డుకున్న సంఘటనను వైసీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు తె లిసింది. సొంత పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకోవడాన్ని తీవ్రంగా పరిగణిం చింది. నాగభూషణంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. అయితే నాగభూషణంరెడ్డి అనుచరులు మాత్రం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేశామ ని వాపోతున్నారు. ఈదులబళాపురంకు చెందిన నాగభూషణంరెడ్డికి పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు, నాగభూషణంరెడ్డికి కొంతకాలంగా మనస్పర్థలున్నాయి. దీంతో ఎమ్మెల్యేను అ డ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో నాగభూషణంరెడ్డి సస్పెన్షనను ఎమ్మెల్యే వర్గీయులు స్వాగతిస్తుండగా, వ్యతిరేక వర్గీయులు ఖం డిస్తున్నారు. ఎమ్మెల్యే గ్రామ సమస్యలు తీర్చకపోవడంతోనే అడ్డుకున్నామని పేర్కొంటున్నారు.
Updated Date - 2023-05-01T23:45:13+05:30 IST