క్రిస్మస్‌కు ప్రార్థనా మందిరాలు ముస్తాబు
ABN, Publish Date - Dec 25 , 2023 | 12:10 AM
పురం ప్రాంతంలో క్రిస్మస్ వేడుకల సందడి ప్రారంభమైంది. ఇప్పటికే వివిధ చర్చిల్లో ముందస్తు క్రిస్మస్ వే డుకలను ఘనంగా నిర్వహించారు.
హిందూపురం, డిసెంబరు 24 : పురం ప్రాంతంలో క్రిస్మస్ వేడుకల సందడి ప్రారంభమైంది. ఇప్పటికే వివిధ చర్చిల్లో ముందస్తు క్రిస్మస్ వే డుకలను ఘనంగా నిర్వహించారు. క్రీస్తు ఆరాధన, పవిత్ర బోధనలను ఆయా చర్చిల్లో పాస్టర్లు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో క్యాండిల్ లైట్ పేరుతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా వివిధ చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. క్రిస్మస్ ట్రీలు, నక్షత్రం, వివిధ అలంకరణ సామాగ్రి అమ్మకాలు ఆదివారం పట్టణంలో జోరుగా సాగింది. క్రిస్మస్ స్టార్లకు డిమాండ్ పెరిగింది. దీంతో క్రైస్తవుల అభిరుచులకు అను గుణంగా కాగితం, ప్లాస్టిక్, రబ్బర్ వంటి వాటితో వివిధ సైజుల్లో క్రిస్మస్ స్టార్లను విక్రయానికి పెట్టారు. అలాగే పట్టణంలో క్రైస్తవులు తమ ఇళ్లకు విద్యుత దీపాలంకరణ చేశారు. సోమవారంక్రిస్మస్ సందర్భంగా పిల్లలకు మిఠాయిలు పంచే శాంతాక్లాజ్ టోపీలు, కోట్లు, క్రిస్మస్ ట్రీలు అందుబాటు లోకి వచ్చాయి. పట్టణంలో పెనుకొండ రోడ్డులోని సీఅండ్‌ఐజీ మిషన చర్చి ని విద్యుత దీపాలతో విశేషంగా అలంకరించారు. అలాగే మిషనకాంపౌండ్ చర్చి, పరిగి రోడ్డులో ఉన్న చర్చిని విద్యుత దీపాలతో అలంకరించి లోపల వివిధ రకాల పూలతో చెట్లతో అలంకరించారు. అదేవిధంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న చర్చిలను ముస్తాబు చేశారు.
మడకశిరటౌన్: పట్టణంలో నూతనంగా నిర్మించిన సీఅండ్‌ఐజీ చర్చితో పాటు మరో మూడు ప్రార్థనా మందిరాలు సోమవారం క్రిస్మస్ వేడుకలకు ముస్తాబయ్యాయి. విద్యుత్‌దీపాలతో అలంకరించారు. వివిధరకాల స్టార్లతో కొత్తశోభ సంతరించుకున్నాయి. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
పావగడ: తాలూకా వ్యాప్తంగా అన్ని చర్చిల్లోనూ సోమవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని చర్చిలను అలంకరించారు. ఆదివారం రాత్రి నుంచే ప్రార్థనలో చేస్తున్నట్లు పావగడలోని చర్చి పాస్టర్ డేవిడ్‌రాజు తెలియజేశారు.
Updated Date - Dec 25 , 2023 | 12:10 AM