ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభం

ABN, First Publish Date - 2023-05-29T23:33:07+05:30

ఖరీఫ్‌ సీజనలో రైతులకు ప్రభుత్వం 40శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తన కాయల పంపిణీని సోమవారం జిల్లావ్యాప్తంగా అధికారులు ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండరూరల్‌/గోరంట్ల/మడకశిరటౌన(అమరాపురం)/ రొళ్ల/రొద్దం/అగళి, మే 29: ఖరీఫ్‌ సీజనలో రైతులకు ప్రభుత్వం 40శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తన కాయల పంపిణీని సోమవారం జిల్లావ్యాప్తంగా అధికారులు ప్రారంభించారు. పెనుకొండ వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏడీఓ స్వయం ప్రభ చేతులమీదుగా పంపిణీ చే సి మాట్లాడారు. మండలవ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ఇప్ప టి వరకు 356 మంది రైతులు 923 బస్తాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆయా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ర్టేషన చేసుకున్న రైతులకు ఈనెలాఖరులోగా విత్తన పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివశంకరప్ప, ఏఓ సురేంద్రనాయక్‌, ఏఈఓలు, రైతు భరోసా సిబ్బంది పాల్గొన్నారు. గోరంట్ల మండల కాంప్లెక్స్‌ ఆర్‌బీకేలో వేరుశనగ విత్తన కాయల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. మండలానికి కే-6 రకం వేరుశనగ 4387 క్విం టాళ్లు మంజూరైనట్లు వ్యవసాయాధికారి తెలిపారు. ఇప్పటి వరకు 17 ఆర్బీకేల ద్వారా 1953 మంది రైతులు విత్తన కాయల కోసం రిజిస్ర్టేషన చేసుకోగా, 1673 క్వింటాళ్లు సరఫరా జరిగినట్లు తెలిపారు. తహసీల్దార్‌ రంగనాయకులు, ఎంపీడీఓ రఘునాథ్‌గుప్త, హిందూపురం అగ్రికల్చర్‌ ఏడీ అల్తాఫ్‌ అలీఖాన, ఏఓ మహబూబ్‌బాషా, ఆర్బీకే సిబ్బంది గౌతంనాయక్‌, వైష్ణవి, అశ్విని, లక్ష్మీనారాయణ, నరసింహులు, అశ్వర్థనారాయణరెడ్డి, రైతులు పాల్గొన్నారు. అమరాపురం మండలంలోని 15 రైతు భరోసా కేంద్రాల్లో విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారి మంజునాథ్‌ తెలిపారు. 15 రైతు భరోసా కేంద్రాల్లో కలిపి వెయ్యి కింటాళ్లు రైతులకు సరఫరా చేసినట్లు తెలిపారు. మరో రెండు వేల క్వింటాళ్ల వరకు మండలానికి విత్తన వేరుశనగ రావాల్సి ఉందన్నారు. రొళ్ల మండలంలోని అన్ని ఆర్‌బీకేల్లో రైతులకు విత్తన వేరుశనగ కాయలను పంపిణీ చేశారు. కార్యక్రమం లో ఏఓ రాజ్యలక్ష్మీ, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నళిని పాల్గొన్నారు. రొద్దం లో రైతులకు అధికారులు విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అ ర్హులైన ప్రతి రైతుకు విత్తన వేరుశనగను అందజేస్తామని ఏఓ నివేది త తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ అంజాద్‌, ఆర్బీకే సిబ్బంది, రైతు లు పాల్గొన్నారు. అగళి మండలంలోని రైతు భరోసా కేంద్రాల్లో విత్తన వేరుశనగ కోసం నమోదు చేసుకొన్న రైతులకు పంపిణీ చేసినట్లు ఏఓ శేఖర్‌నాయక్‌ తెలిపారు. కే-6 రకం మండలానికి 4387 క్వింటాళ్లు కేటాయించారని, రిజిస్ట్రేషన చేసుకొన్న ప్రతి రైతుకు విత్తన వేరుశనగ పం పిణీ చేస్తామన్నారు.

Updated Date - 2023-05-29T23:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising