చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : గుండుమల
ABN, First Publish Date - 2023-12-04T00:15:55+05:30
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు.
గుడిబండ, డిసెంబరు 3 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. ఆయన ఆదివారం మండ లంలోని మద్దనకుంట గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో స మావేశం నిర్వహించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందాలంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు. 2024ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చప్పి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మద్దనకుంటప్ప, ఎస్సీసెల్ అధ్యక్షులు మంజునాథ్, లింగాయత సంఘం అధ్యక్షులు దుర్గేష్, షబ్బీర్, లక్ష్మీనరసప్ప, దాసప్ప, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-04T00:15:58+05:30 IST