ప్రాణాలు పోతే తప్ప స్పందించరా?
ABN, First Publish Date - 2023-05-21T00:04:43+05:30
ప్రాణాలు పోతే తప్పా విద్యుత శాఖ అధికారులు స్పందించరా? అంటూ అధికారుల తీరుపై మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు మం డిపడ్డారు.
విద్యుతశాఖ అధికారుల తీరుపై సభ్యుల మండి పాటు
హిందూపురం, మే 20: ప్రాణాలు పోతే తప్పా విద్యుత శాఖ అధికారులు స్పందించరా? అంటూ అధికారుల తీరుపై మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు మం డిపడ్డారు. శనవారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వస భ్య సమావేశం జరిగింది. మండల ప్రత్యేక అధికారి, గృ హనిర్మాణశాఖ ఈఈ చంద్రమౌళి రెడ్డి, మండల స్థాయి అధికారులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూలకుంట సర్పంచు మంజునాథ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. రెండేళ్లుగా పూలకుంట వద్ద లేపాక్షి-హిందూపురం ప్రధాన రహదారికి పక్కనే చేతికందే ఎత్తులో విద్యుత తీగలున్నాయని పలు సమావేశాల్లో మొరపెట్టుకున్నా అధికారులు స్పందించలేదన్నారు. దీంతో ఎవరివైనా ప్రాణాలు పోతేతప్పా మీరు స్పందించరా? అంటూ నిలదీశారు. ట్రాన్సకో అధికారి మాట్లాడుతూ మీ సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఇదిలా ఉంటే మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ కొద్దిసేపుండి వెళ్లిపోయారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు డుమ్మా కొట్టారు. మూడునెలలకోసారి జరిగే సమావేశంపై వారికి ఎంత మక్కువ ఉందో దీన్నిబట్టి తెలుస్తుంది. హాజరైన ప్రజాప్రతినిధులు పలు సమస్యలపై మాట్లాడారు.
Updated Date - 2023-05-21T00:04:43+05:30 IST