విద్యతోనే భవిష్యత్తుకు బంగారు బాట
ABN, First Publish Date - 2023-06-11T00:05:22+05:30
బాలబాలికలకు మనం అందించే విద్య, సంస్కారం తోనే వారి భవిష్యత్తుకు బంగారు బాట కాగలదని పలువురు వక్తలు పేర్కొన్నారు.
బాలవికాస్ జాతీయ వార్షికోత్సవంలో వక్తలు
పుట్టపర్తి, జూన 10: బాలబాలికలకు మనం అందించే విద్య, సంస్కారం తోనే వారి భవిష్యత్తుకు బంగారు బాట కాగలదని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం రెండవ రోజు సాయికుల్వంతు మందిరంలో బాలవికాస్ 13వ జాతీయ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా పలువురు వక్తలు సత్యసాయి బాబా అందిస్తున్న బాలవికాస్ విద్య ప్రాధాన్యతను వివరించారు. పిల్లలకు సంస్కారంతో పాటు తల్లిదండ్రుల పట్ల భక్తి, ప్రేమ, మానవతా విలువలు, ఆధ్మాత్మికత, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచసూత్రాలను నేర్పుతున్నామన్నారు. వ్యక్తిత్వంలేని విద్య, పదవులు ఉన్నా వ్యర్థమని, మనిషికి విలువలతో పాటు సంస్కారం అవసరమని అన్నారు. వాటిని బాల్యంలోనే బోధించాల్సిన అవసరాన్ని ఆనాడే సత్యసాయి గుర్తించారన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన పూర్వ విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. విద్యార్థులు సంగీతగానంతో సందర్శకులను అలరింపచేశారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సదస్సులో 3500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-11T00:05:22+05:30 IST