ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సును ఢీకొన్న ఐచర్‌ వాహనం

ABN, First Publish Date - 2023-04-29T00:10:37+05:30

మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు రక్షా అకాడమీ వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవా రం బస్సును ఐచర్‌ వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గా యపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరి మృతి - పలువురికి గాయాలు

చిలమత్తూరు, ఏప్రిల్‌ 28: మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు రక్షా అకాడమీ వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవా రం బస్సును ఐచర్‌ వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గా యపడ్డారు. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలివి. బెంగళూరు నుంచి అనంతపురం వెళుతున్న ఐచర్‌ వాహనం కొడికొండ చెక్‌పోస్టు వద్ద రక్షా అకాడ మీ ప్రధాన గేటు వద్దకు రాగానే కుక్క అడ్డంగా వచ్చింది. దీంతో వాహన డ్రైవర్‌ కుక్క ను తప్పించబోయాడు. వాహన వేగం ఎక్కువగా ఉండటంతో ఐచర్‌ వాహనం అదుపుతప్పింది. బీదర్‌ నుంచి బెంగళూరుకు అటువైపుగా వెళుతున్న కర్ణాటక సూపర్‌ లగ్జరీ స్లీపర్‌ కోచ బస్సును ఢీకొట్టింది. ఐచర్‌ వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జ యింది. ఐచర్‌ వాహన డ్రైవర్‌ వెంకటరాముడు(45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం నుంచి బస్సులో ప్రయాణికులను కాపాడటానికి బస్సు డ్రైవర్‌ విశ్వనాథ్‌ పూ ర్తిస్థాయిలో ప్రయత్నించాడు. తుదకు బస్సును రోడ్డు పక్కకు పోనిచ్చాడు. దాంతో బ స్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్‌ విశ్వనాథ్‌ స్వల్పంగా గాయాలపాలయ్యాడు. మృతుడు వెంకటరాముడు స్వగ్రామం నార్పల మండలం సిద్దరాచర్ల గ్రామంగా గుర్తించారు. బస్సు డ్రైవర్‌ విశ్వనాథ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-04-29T00:10:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising