ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భార కేంద్రాలు

ABN, First Publish Date - 2023-01-14T23:38:01+05:30

క్షేత్రస్థాయిలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు కాస్తా... నిరుపయోగంగా మారి ‘రైతు భార కేంద్రాలు’గా మారాయి. జగన మోహన రెడ్డి ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అనుమతులు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- భరోసా ఇవ్వని ఆర్బీకేలు

- ఉత్పత్తులు కొన్నదీ లేదు.. అమ్మిందీ లేదు..!

- అందుబాటులో లేని ఎరువులు, విత్తనాలు

- ఈ-క్రాప్‌ నమోదుకే సిబ్బంది పరిమితం

‘‘సర్టిఫై చేసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ రంగంలో వినియోగించే ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు విక్రయించి రైతులను ఆదుకుంటాం. వ్యవసాయ దిగుబడులను పెంచడం, రైతులకు ఆదాయాలను పెంచడమే రైతు భరోసా కేంద్రాల లక్ష్యం. ఆర్బీకే కేంద్రాలు రైతులకు ఆదాయ వనరులుగా మారుస్తున్నాం...’’

-గతేడాది సంక్రాంతి సమయంలో

సీఎం జగనమోహన రెడ్డి వ్యాఖ్యలు

ప్రస్తుతం ఈ ప్రకటనలన్నీ గాల్లో కలిసిపోయాయి. క్షేత్రస్థాయిలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు కాస్తా... నిరుపయోగంగా మారి ‘రైతు భార కేంద్రాలు’గా మారాయి. జగన మోహన రెడ్డి ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అనుమతులు చేసింది. ఆ కేంద్రాలు రైతులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదన్నది మాత్రం వాస్తవం. రైతు ఉత్పత్తులు కొనుగోలు చేసి, విక్రయించాలన్నది ఆర్బీకేల ఉద్దేశం కాగా రైతు భరోసా కేంద్రాలు ఆ లక్ష్యం దిశగా పయనించడం లేదు.

తనకల్లు, జనవరి 14: తనకల్లు మండల వ్యాప్తంగా 14 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల తరువాత మల్లిరెడ్డిపల్లి, కొక్కంటి, కోర్తికోట, తనకల్లు-1, ఈతోడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పూర్తి చేశారు. మిగిలిన గ్రామాల్లో ఇంకా రైతు భరోసా కేంద్రాలు పునాదులు, గోడలవరకు పూర్తి అయ్యాయి.మరికొన్ని చోట్ల పునాదులు కూడా తవ్విన దాఖలాలు లేవు. రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుకాకనే రైతు భరోసా కేంద్రాలద్వారా సర్వం అందిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. రైతు భరోసా కేంద్రాల్లో నేటికి కూడా రైతులకు కావలసిన క్రిమిసంహారక మందులు, ఎరువులు, ప్రత్యేకించి నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది. రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది కేవలం ఈ-క్రాప్‌ నమోదుకే పరిమితమయ్యారు. కనీసం గ్రామాలకు వెళ్లి రైతులు సాగుచేసిన పంటలకు వస్తున్న చీడపీడల నివారణకు సలహాలు, సూచనలు ఇచ్చేస్థితిలో కూడా అధికార యంత్రాంగం లేరు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఏనాడో విఫలమైంది. ఆవైపు ప్రయత్నించిన పాపాన రైతు భరోసా కేంద్రాలు పనిచేయలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రైవేట్‌ వ్యాపారులే దిక్కు

కాయకూరలు, దోస, టమోటా, కర్బూజ లాంటి పంట విత్తనాలకోసం ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం. మా గ్రామ పరిధిలో వందలాది ఎకరాల్లో కాయగూరలు,టమోటా, దోస, కర్బూజ లాంటి పంటలు సాగు చేస్తారు. విత్తనాలకోసం రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే ఆ విషయం కూడా అధికారులకు తెలియడం లేదు. ప్రైవేట్‌ వ్యాపారులను నమ్మి వేల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. ఒక్కోసారి నకిలీ విత్తనాలతో నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతు భరోసా కేంద్రాల్లో అన్నిరకాల విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు అందుబాటులోకి తీసుకురావాలి.

-శ్రీధర్‌రెడ్డి, రైతు, సున్నంపల్లివాండ్లపల్లి

దళారులకు అమ్మాల్సి వస్తోంది

మల్లిరెడ్డిపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉన్నప్పటికి మేము పండించిన వేరుశనగను దళారులకు అమ్ముతున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారావేరుశనగ కొనుగోలు చేస్తామన్న అధికారులు తరువాత పట్టించుకోలేదు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కూడా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో లేవు. ఇక చేసేదేమీ లేక ప్రైవేట్‌ వ్యాపారులపై ఆధారపడి, నష్టాలకు పంట ఉత్పత్తులను అమ్ముకుంటున్నాం. రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి.

- భాస్కర్‌రెడ్డి, రైతు, పెద్దపల్లి

Updated Date - 2023-01-14T23:38:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising