రైతుల గోడు పట్టదా?
ABN, First Publish Date - 2023-06-07T23:59:44+05:30
‘ఈదురుగాలులు, వడగండ్ల వానతో పంటలన్నీ నేలపాలయ్యాయి. విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. తా గునీటికీ ఇబ్బందులుపడ్డాం. ఒక్క అధికారి గానీ, ప్రజాప్రతినిధి గానీ ప ట్టించుకోలేదు. రైతులు, ప్రజల గోడు మీకు పట్టదా?’ అని ఉప్పునేసినప ల్లి సర్పంచు ముత్యాలప్పనాయుడు నిలదీశారు.
పంట నష్టపోతే పలకరించేనాథుడే లేరు..
విద్యుత్తు కోతలు, తాగునీటి సమస్యతో ఇబ్బందులు
మండల సర్వసభ్య సమావేశంలో సభ్యుల నిలదీత
రైతు కష్టాలపై ఆంధ్రజ్యోతి కథనాల క్లిప్పింగుల ప్రదర్శన
ధర్మవరం రూరల్, జూన 7: ‘ఈదురుగాలులు, వడగండ్ల వానతో పంటలన్నీ నేలపాలయ్యాయి. విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. తా గునీటికీ ఇబ్బందులుపడ్డాం. ఒక్క అధికారి గానీ, ప్రజాప్రతినిధి గానీ ప ట్టించుకోలేదు. రైతులు, ప్రజల గోడు మీకు పట్టదా?’ అని ఉప్పునేసినప ల్లి సర్పంచు ముత్యాలప్పనాయుడు నిలదీశారు. బుధవారం స్థానిక ఎం పీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావే శం నిర్వహించారు. ఈసందర్భంగా రైతుల కష్టాలపై ఆంధ్రజ్యోతిలో ప్ర చురించిన కథనాల క్లిప్పింగులను సర్పంచు సభలో ప్రదర్శిస్తూ, నిరసన కు దిగారు. 15 రోజుల క్రితంఉప్పునేసినపల్లి పంచాయతీ, చిగిచెర్ల, చింతలపల్లి గ్రామాల్లో వడగండ్ల వాన, ఈదురుగాలలతో పంటలన్నీ నష్టపో యినట్లు వాపోయారు. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగి, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. సుమారు వంద ఎకరాల్లో అరటి, బొప్పాయి పంటలు నష్టపోతే, ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వరా? రైతు ల గోడు పట్టదా? అని ప్రశ్నించారు. పక్క గ్రామాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తోలి ప్రజల దాహార్తి తీర్చామని, ఏఒక్క అధికారి, ప్రజాప్రతినిధి గానీ మాగ్రామాలకు వచ్చి కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలంటే ఎందుకంతా అలుసు అంటూ నిలదీశారు. పార్టీలకతీతంగా పథకాలు అందిస్తామని, ప్రజల సమస్యలు వెంటనే ప రిష్కరిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం... కష్టకాలంలో ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఇదేనా ప్రజల పట్ల చిత్తశుద్ధి అంటూ వాపోయారు. అనంతరం పలువురు సర్పంచులు తమ గ్రామాల పరిధిలోని సమస్యలను లెవనెత్తారు. సమావేశంలో ఎంపీడీఓ సౌభాగ్యకుమా రి, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-07T23:59:44+05:30 IST