ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అనంత’ నుంచి ఇచ్ఛాపురం దాకా.. సమరయాత్ర

ABN, First Publish Date - 2023-01-26T00:36:18+05:30

ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టం హామీల అమలు కోసం అనంతపురం నుంచి ఇచ్ఛాపురం వరకూ సమర యాత్ర పేరుతో బస్సు యాత్ర సాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. విద్యార్థి, యువజన సంఘాలు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సుయాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహిం చారు.

బస్సు యాత్రను ప్రారంభిస్తున్న రామకృష్ణ, చలసాని శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రారంభించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, చలసాని

మోదీ ప్రభుత్వం దద్దరిల్లాలి: రామకృష్ణ

పోరాటాలతోనే విద్యార్థులకు భవిష్యత్తు

ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని

విద్యార్థి, యువజన సంఘాల బస్సుయాత్ర

అనంతపురం విద్య, జనవరి 25 : ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టం హామీల అమలు కోసం అనంతపురం నుంచి ఇచ్ఛాపురం వరకూ సమర యాత్ర పేరుతో బస్సు యాత్ర సాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. విద్యార్థి, యువజన సంఘాలు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సుయాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహిం చారు. ముఖ్య అతిథులుగా హాజరైన రామకృష్ణ, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, సీపీఎం రాష్ట్ర నాయకులు ఓబులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జగదీష్‌, అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్‌, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌ అంబేడ్కర్‌ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత బస్సుయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథులు బస్సులో రాగా విద్యార్థి, యువజన సంఘాల నాయకులు అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న పీవీకేకే కళాశాల వరకూ ర్యాలీగా వచ్చారు. కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, యువత బస్సుయాత్రను అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ చేయడం అభినందనీయ మన్నారు. హోదా ఇవ్వడంతోపాటు విభజన హామీలు నెరవేరిస్తేనే ఉద్యోగాలు, పరిశ్రమలు వస్తాయన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దద్దరిల్లేలా యువత, విద్యార్థులు విజృంభించాలన్నారు. చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రం నయవంచన, నమ్మక ద్రోహంతో విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర రాషా్ట్రలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఎవరైనా పరిశ్ర మలు పెట్టాలంటే వారికి రాయితీలు ఇవ్వాలన్నారు. రాయితీలు ఇవ్వాలం టే హోదా ఉంటేనే సాధ్యమన్నారు. పోరాటాలతోనే విద్యార్థులకు, ఈ రాషా్ట్రనికి భవిష్యత్తు ఉంటుందన్నారు. బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర నాయకులు ఓబులు తెలిపారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నాగరాజు, అల్లూరి సీతారామరాజు మేనల్లుడు సత్యనారాయణ, ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సనబాబు, కార్యదర్శి శివారెడ్డి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు లెనినబాబు, కార్యదర్శి రాజేంద్ర, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షులు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, ఏపీ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ చైర్మన సాకే నరేష్‌, ఎస్‌ఎ్‌పఐ జిల్లా కార్యదర్శి పరమేష్‌, ఎనఎ్‌సయూఐ, పీడీఎ్‌సయూ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:36:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising