నడి రోడ్డులో గోతి - ఆదమరిస్తే అధోగతి
ABN, First Publish Date - 2023-04-08T23:59:57+05:30
పట్టణంలో నూతనంగా చే పట్టిన గ్యాస్ పైప్‌లైన్లు కాలనీవాసులకు గుదిబండగా మారాయి.
గ్యాస్ పైప్‌లైన తంటా
గుంతలు తవ్వారు... వదిలేశారు
పొంచివున్న ప్రమాదం
మురుగు నీరంతా గోతుల్లోనే... సంపుల్లోకీ చేరుతున్న వైనం
ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారేరీ?
హిందూపురం అర్బన, ఏప్రిల్ 8: పట్టణంలో నూతనంగా చే పట్టిన గ్యాస్ పైప్‌లైన్లు కాలనీవాసులకు గుదిబండగా మారాయి. కాలనీల్లో ఇరుకైనా సందుల్లో కూడా పైప్‌లైన్ల ద్వారా గ్యాస్ కనెక్షన ఇచ్చేందుకు ఓ ప్రైవేట్ కంపెనీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆ యా కాలనీల్లో ప్రధాన రోడ్లతో పాటు సందులు, గొందుల్లో కూడా పైప్‌లైన కోసం రోడ్డుకు ఇరువైపులా గోతులు తవ్వేశారు. మరికొన్ని చోట్ల రోడ్డుకు అడ్డంగా కూడా ఈ గోతులు దర్శనమిస్తున్నాయి. ఇటీవల పట్టణంలో ఎక్కడ చూసినా గ్యాస్ కనెక్షనల కోసం గుంతలు తవ్వుతున్నారు. అయితే ఒక్క రోజులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, గుంతలు పూడ్చివేసి వెళ్లామని గ్యాస్ పైప్‌లైన నిర్వాహకులు చెబుతారు. తీరా వారి పని కాగానే, పలుచోట్ల గుంతలు అలాగే వదిలేసి వెళ్తున్నారు. టీచర్స్ కాలనీలో ఇదే తంతు జరిగింది. శనేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో మోకాలిలోతు గుంతను తవ్వారు. అది కూ డా రోడ్డుకు మధ్యలో తవ్వడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిసర ప్రాంతాల వారు ఇళ్లకు చేరాలంటే ఇబ్బందులు ప డుతున్నారు.
ఈ గుంతల్లోకి చుట్టుపక్కల ఇళ్ల నుంచి మురుగునీరు వచ్చి చేరుతోంది. కొన్ని ఇళ్లల్లోని తాగునీటి సంపుల్లోకి కూడా మురుగునీరు చొరబడిందని వాపోతున్నారు. గమనించక ఆ నీటినే వాడుకున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ను మున్సిపల్ అధికారులకు తెలియజేశామన్నారు. ఐదు రోజులు గా అధికారులు వచ్చి చర్యతీసుకుంటారని ఎదురు చూశామనీ, ఎ వరూ ఇటువైపు రాలేదని ఆగ్రహించారు. కాలనీకి కనీసం రోడ్లు, డ్రైన్లు లేవు. ఉన్న రోడ్లు కాస్త గుంతలు పెట్టేశారని ఆగ్రహిస్తున్నా రు. డ్రైన్లు లేకపోవడంతో ఇళ్ల పక్కనే మురుగునీరు వెళ్లడంతో పం దులకు ఆవాసాలుగా మారాయని ఆవేదన చెందుతున్నారు.
వారం రోజులుగా ఇబ్బంది పడుతున్నాం
సావిత్రి, గృహిణి, టీచర్స్ కాలనీ
గ్యాస్ పైప్‌లైను కోసం గుంతలు తవ్వి, అ లాగే వదిలేశారు. వారం రోజులుగా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. గుత్తలు కట్టించుకోవడానికి మాత్రం పరుగున వస్తారు. తాగునీరు 15 రో జులకోమారు వస్తోంది. నెలకు నాలుగుమార్లు ట్యాంకర్ల నీరు కొం టున్నాం. వీధిలైట్లు వెలుగవు. విషపురుగులతో భయం భయంగా గడుపుతున్నాం. ఇప్పటికైనా సౌకర్యాలు కల్పించాలి.
సంపుల్లోకి మురుగునీరు చేరుతోంది..
భవాని, గృహిణి, టీచర్స్ కాలనీ
గ్యాస్ పైపులైన ఏర్పాటు చేయడానికి తవ్విన గుంతలు అలాగే వదిలేశారు. దీంతో మురుగునీరు స్తంభించింది. సంపుల్లోకి చేరుతోంది. విషయం తెలియకుండా వాటినే వా డుకున్నాం. రూ.1500 వెచ్చించి సంపు శుభ్రం చేయించాం. ప్రతిసారీ ఇలా శుభ్రం చేయించాలంటే ఎలా? అధికారులు చర్యలు తీసుకోవాలి.
Updated Date - 2023-04-08T23:59:57+05:30 IST