ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చెన్నై వెళ్లేదెలా?రాత్రి వేళల్లో రైళ్లకు కటకట

ABN, First Publish Date - 2023-11-24T23:58:48+05:30

గుంతకల్లు రైల్వే డివిజనలో తొలి డబ్లింగ్‌ లైను అయిన చెన్నై రూటులో రైళ్ల సమస్య ఉండేదికాదు. కానీ ఇప్పడు సాయంత్రం అయ్యిందంటే చెన్నైకు వెళ్లడానికి ఒక్క రైలూ దొరకని పరిస్థితి ఏర్పడింది. కొవిడ్‌ సమయంలో కొన్ని రైళ్లను రద్దు చేశారు.

కొవిడ్‌ సమయంలో రైళ్ల రద్దు

తిరిగి ప్రారంభించని అధికారులుగుంతకల్లు, నవంబరు 24:

చెన్నైకు రైళ్ల కటకట ఏర్పడింది. గుంతకల్లు రైల్వే డివిజనలో తొలి డబ్లింగ్‌ లైను అయిన చెన్నై రూటులో రైళ్ల సమస్య ఉండేదికాదు. కానీ ఇప్పడు సాయంత్రం అయ్యిందంటే చెన్నైకు వెళ్లడానికి ఒక్క రైలూ దొరకని పరిస్థితి ఏర్పడింది. కొవిడ్‌ సమయంలో కొన్ని రైళ్లను రద్దు చేశారు. దీంతో తమిళనాడు రాజధానికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తిరుపతికి వెళ్లి, అక్కడి నుంచి ఇంకో రైలు ఎక్కాల్సిన దుస్థితి దాపురించింది. చెన్నైకు వెళ్లి వ్యాపారాలు చేసేవారికి, ప్రైవేటు ఉద్యోగులకు, విద్యార్థులకు రైలు ప్రయాణం సమస్యగా మారింది.

ఆఖరి రైలు మధ్యాహ్నానికే..

చెన్నై వెళ్లడానికి గతంలో సాయంత్రం, రాత్రి సమయాల్లో కూడా రైళ్లు ఉండేవి. కొవిడ్‌ సమయంలో రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు. దీంతో ఇప్పుడు గుంతకల్లులో మధ్యాహ్నం 2 గంటలకు వచ్చే ముంబై-చెన్నై సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 22157) రైలే చివరి డెయిలీ రైలుగా మారింది. గతంలో గుంతకల్లు మీదుగా చెన్నై మెయిల్‌ (16009) సాయంత్రం ఆరున్నకు వెళ్లేది. ఆ రైలు ద్వారా జిల్లావాసులు ఉదయానికల్లా చెన్నైలో దిగి పనులు చేసుకునేవారు. కరోనా కారణంగా 2020లో ఆ రైలును, దాని ఆపోజిట్‌ రైలును రద్దుపరిచారు. దాని స్థానంలో ముంబై-చెన్నై (22157/ 58) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సను ప్రవేశపెట్టారు. అది మధ్యాహ్నం గుంతకల్లుకు వస్తుండటంతో రాత్రి చెన్నైకు వెళ్లడానికి రైలు లేకుండాపోయింది. అలాగే చెన్నైకు వెళ్లివచ్చే లెవెన/టువల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా రద్దుపరచి, 22159/60 నెంబరుతో వేరే రైలును ప్రవేశపెట్టారు. ఈ రైౖలు అర్ధరాత్రి దాటాక 2 గంటలకు గుంతకల్లుకు వచ్చివెళుతోంది. ఈ రైలు వల్ల ఉదయాన్నే చెన్నైలో దిగడానికి వీలుకానందున, పెద్దగా ఉపయోగపడటం లేదని స్థానికులు అంటున్నారు.

Updated Date - 2023-11-24T23:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising