యువగళం ఉద్యమంలా మారుతోంది
ABN, First Publish Date - 2023-04-02T01:04:03+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన పాదయాత్ర ఉద్యమంలా మారుతోందని పీఏసీ చైర్మన, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రపై ఆయన చర్చించారు. ఈ నెల 5న కూడేరు మండలం నుంచి ప్రారంభమయ్యే యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.
పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్
ఉరవకొండ, ఏప్రిల్ 1: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన పాదయాత్ర ఉద్యమంలా మారుతోందని పీఏసీ చైర్మన, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రపై ఆయన చర్చించారు. ఈ నెల 5న కూడేరు మండలం నుంచి ప్రారంభమయ్యే యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుం చి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తామే అభ్యర్థులన్నట్లు ప్రచారంచేసి, అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో నిర్వహించే పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని అన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, ఏఎంసీ మాజీ చైర్మన్లు దేవినేని పురుషోత్తం, రేగాటి నాగరాజు, మండల కన్వీనర్లు విజయ్ భాస్కర్, నూతేటి వెంకటేశులు, బీడీ మారయ్య, ప్రసాద్, నాయకులు రామాంజినేయులు, మాజీ ఎంపీపీ సుంకురత్నమ్మ, తిమ్మప్ప, భీమలింగప్ప, దేవేంద్ర, మల్లికార్జున, తిప్పయ్య, నాగేంద్ర, నాగభూషణం, నారాయణస్వామి, తులసీదా్‌సనాయక్, వన్నూరుస్వామి, సుధాకర్ యర్రగుంట్ల వెంకటేశులు, నెట్టెం రాంబాబు, సర్పంచులు సీతారాములు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేశవ్
Updated Date - 2023-04-02T01:04:03+05:30 IST