ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్న జగన్

ABN, First Publish Date - 2023-01-23T23:56:52+05:30

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన వికృత విన్యాసాలతో ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

అనంతపురం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన వికృత విన్యాసాలతో ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ కుట్రతోనే చంద్రబాబు రోడ్‌ షోలు, బహిరంగ సభలను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. అందుకే జీవో నెం.1ను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. జగన పిచ్చి చేష్టలతో బ్రిటీష్‌ కాలంనాటి చట్టాలు తీసుకొచ్చి లోకే్‌షబాబు పాదయాత్రకు షరతులు విధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కన్నెరచేసుంటే జగనరెడ్డి వేల కి.మీ. పాదయాత్ర చేయగలిగేవాడా అని ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులను హరించేలా ఉన్న జీఓనెం.1 అమలును కోర్టు తాత్కాలికంగా నిలువరించిందని అన్నారు. జనవరి 27న లోకే్‌షబాబు తలపెట్టిన పాదయాత్రను ఆపాలనే రాజకీయ దురుద్దేశంతో జగనరెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నులపడం, ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే జగనరెడ్డి విధిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌ షోలు నిర్వహిస్తున్న మంత్రులు, వైసీపీ నాయకులకు జీవో నెం.1 ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. ఇటీవల రాజమండ్రిలో జగనరెడ్డి నిర్వహించిన రోడ్‌ షో, బహిరంగ సభలకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ తన సొంత నియోజకవర్గంలో జాతీయ రహదారిపై భారీ ర్యాలీతో చేసిన హడావుడి కనిపించలేదా అని నిలదీశారు. లోకే్‌షబాబు పాదయాత్రపై కుట్రలకు తెరలేపడం ద్వారా జగనరెడ్డి తన ఓటమిని ముందుగానే అంగీకరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. లోకేష్‌ పాదయాత్ర స్వేచ్ఛగా, ప్రశాంతంగా, ప్రజల మద్దతుతో చేసుకునేలా డీజీపీ బేషరతుగా ప్రకటన విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు, వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యకర్తల బలం, బలగంతో పాదయాత్రను ఖచ్చితంగా చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-23T23:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising