సీమ హక్కుల రక్షణలో జగన విఫలం
ABN, First Publish Date - 2023-07-11T00:40:46+05:30
రాయలసీమ హక్కుల పరిరక్షణలో ముఖ్యమంత్రి జగన ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గంలో రాయలసీమ భవిష్యత్తు సమాలోచన పేరిట టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
అఖిలపక్ష సమావేశంలో మాజీ మంత్రి కాలవ
రాయదుర్గం, జూలై 10: రాయలసీమ హక్కుల పరిరక్షణలో ముఖ్యమంత్రి జగన ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గంలో రాయలసీమ భవిష్యత్తు సమాలోచన పేరిట టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మిషన రాయలసీమ పేరుతో కడపలో అభివృద్ధి ప్రణాళికను లోకేష్ ప్రకటించారని గుర్తు చేశారు. సీఎం తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదని, అందుకే కృష్ణా జలాల్లో కేసీఆర్ అధిక వాటా అడిగే సాహసం చేస్తున్నారని అన్నారు. 2015లోనే ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకం జరిగిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశకు 513 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాను కేంద్రం అప్పట్లోనే తేల్చిందని అన్నారు. జగన బలహీనతలను ఆసరాగా చేసుకుని రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల్లో సగం వాటా అంటూ వితండవాదం చేస్తోందని మండిపడ్డారు. తుంగభద్ర జలాల అక్రమ వాడకానికి నవలి ప్రాజెక్టును కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటిస్తే, ఏపీ సర్కారు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. బెంగళూరులో జగనరెడ్డికి ఆస్తులున్నాయి కాబట్టే కర్ణాటక ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన రాయలసీమ ప్రణాళికలో ప్రకటించిన పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు రాయలసీమ హక్కులను కాపాడతామని తెలిపారు.
- జగన సీఎం అయిన తరువాత రాయలసీమ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని సీపీఐ నాయకులు నాగార్జున విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టు పనులను నిలిపివేయడం వల్ల సీమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు.
- రాయదుర్గం ప్రాంత జలవనరులపై జగన ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని సీపీఎం నాయకుడు మల్లికార్జున విమర్శించారు. ఐడిపల్లి-బీటీపీ పనులు నాలుగేళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు.
- బీటీ ప్రాజెక్టుకు కృష్ణాజలాల తరలింపు ప్రతిపాదనను టీడీపీ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో చేసిందని రిటైర్డు డీఈ రామాంజినేయులు అన్నారు. అది సాకారమైతేనే ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.
- గడప గడపకు మన ప్రభుత్వం ఒక ఫార్సు కార్యక్రమమని కాంగ్రెస్ నాయకుడు అనిల్ అన్నారు. పోలీసు రక్షణలో తూతూ మంత్రంగా చేశారని అన్నారు. పాఠశాలల విలీనం వల్ల లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఎస్‌ఎ్‌ఫఐ నాయకుగు బంగి శివ అన్నారు. నూతన విద్యావిధానం అత్యంత నష్టదాయకమని ఏఐఎ్‌సఎఫ్ నాయకుడు ఆంజినేయులు అన్నారు.
- లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు వెంకటరమణబాబు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజల పక్షాన పోరాడలేని కాపు రామచంద్రారెడ్డి, అధికారం రాగానే నేడు చెలరేగిపోతున్నారని అన్నారు. ఆయనవి పిరికిపంద రాజకీయాలని దుయ్యబట్టారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకులు హరగోపాల్, ఏఐవైఎఫ్ నాయకులు కొట్రేష్, బీఎస్పీ ఉలిగయ్య, ఎంఎంఐఎస్ మద్దానప్ప, తెలుగుదేశం పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు పసుపులేటి నాగరాజు, యు హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-11T00:40:46+05:30 IST