ఇసుక రీచ వద్ద జనసేన, సీపీఎం నిరసన
ABN, First Publish Date - 2023-04-10T23:21:25+05:30
మండలంలోని జయమంగళి నది నూతన ఇసుక రీచ వద్ద సోమవారం సీపీఎం, జనసేన నాయకులు ఆందోళ నకు దిగారు. రీచ నుంచి కర్ణాటక ప్రాంతాలకు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ అడ్డుకున్నారు.
పరిగి, ఏప్రిల్ 10: మండలంలోని జయమంగళి నది నూతన ఇసుక రీచ వద్ద సోమవారం సీపీఎం, జనసేన నాయకులు ఆందోళ నకు దిగారు. రీచ నుంచి కర్ణాటక ప్రాంతాలకు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ అడ్డుకున్నారు. ఇసుక తవ్వుతున్న ఎక్సాకవేటర్లకు అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు భా రీగా మోహరించారు. ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషనకు త రలించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ వాల్టా చ ట్టం అమలులో ఉన్నా, ధిక్కరించి ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. నది పరివాహక ప్రాంతంలోని వేలాది ఎకరాల భూముల్లో పంట లు సాగుచేస్తున్నామని అన్నారు. ఇసుక తవ్వకాలతో భూగర్భజలా లు అడుగంటి బోరుబావులు పూర్తిస్థాయిలో ఎండిపోతే జీవనం ఎలా సాగించేదని ప్రశ్నించారు. ఈసందర్భంగా పోలీసులు, ఆం దోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్రమ అరెస్టులతో ఉ ద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు.
Updated Date - 2023-04-10T23:21:25+05:30 IST