కోనాపురం గొంతెండుతోంది..
ABN, First Publish Date - 2023-04-09T00:03:13+05:30
మండలంలోని కోనాపురంలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. శుద్ధజల ప్లాంట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్లాంట్‌లో ఎప్పుడు నీరు వస్తుందో తెలీని పరిస్థితి నెలకుంది. దీంతో నీటి కోసం జనం పడిగాపులు కాస్తున్నారు.
ప్లాంట్ నిర్వహణలో యాజమాన్యం ఇష్టారాజ్యం
సకాలంలో నీటి సరఫరా లేక అవస్థలు
మండే ఎండలోనే గ్రామస్థుల పడిగాపులు
పెనుకొండ రూరల్, ఏప్రిల్ 8: మండలంలోని కోనాపురంలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. శుద్ధజల ప్లాంట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్లాంట్‌లో ఎప్పుడు నీరు వస్తుందో తెలీని పరిస్థితి నెలకుంది. దీంతో నీటి కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. మం డే వేసవిలో దాహార్తి తీర్చుకునేందుకు తిప్పలుపడుతున్నారు. సకాలంలో తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోతు న్నారు. శుద్ధజల ప్లాంట్‌కు సకాలంలో నీటి సరఫరా చేయడంలో ప్లాంట్ యాజ్యమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శ లున్నాయి. గ్రామంలో తాగునీటి సమస్యను గుర్తించిన అప్పటి తె లుగుదేశం ప్రభుత్వం రూ.5 లక్షల వ్యయంతో శుద్ధజల ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈప్లాంట్‌కు తిమ్మాపురం వద్ద నిర్మించిన మదర్‌ప్లాంట్ నుంచి నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వ కాలంలో గ్రామానికి సక్రమంగా నీటి సరఫరా చేసి ప్రజల దాహార్తి కష్టాలు తీర్చారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్లాంట్ నిర్వ హణపై శీతకన్ను వేసింది. శుద్ధజల కేంద్రాన్ని సాయి వాటర్ ట్రీట్‌మెంట్ మిత్ర కంపెనీకి అప్పగించారు. రూ.5లకు 20 లీటర్ల నీటిని అందజేస్తున్నారు. అయితే కంపెనీ యాజమాన్యం ప్లాంట్‌కు సకా లంలో నీటి సరఫరా చేయడం లేదు. దీంతో గ్రామస్థులు నీటి కోసం మండే ఎండలో ప్లాంట్ వద్ద ఎదురుచూడాల్సి వస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ప్లాంట్‌లో నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం జనం అవస్థలు పడ్డారు. అధికారులు స్పందించి, శుద్ధజలం క్రమం తప్పకుండా సకాలంలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నా రు. ఈ విషయంపై ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ శ్రీనివాసులును వివరణ కోరడానికి ఫోనలో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
Updated Date - 2023-04-09T00:03:13+05:30 IST