లోకేశను కలిసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
ABN, First Publish Date - 2023-03-28T00:25:22+05:30
ఇటీవల టీడీపీలో చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నారా లోకేశను కలిశారు. గోరంట్ల మండలం తిప్పరాజుపల్లి వద్ద సోమవారం ఉదయం ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు

పెనుకొండ రూరల్, మార్చి 27: ఇటీవల టీడీపీలో చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నారా లోకేశను కలిశారు. గోరంట్ల మండలం తిప్పరాజుపల్లి వద్ద సోమవారం ఉదయం ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో ఉన్న పార్టీ సీనియర్ నాయకులను కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి లోకేశ పరిచయం చేశారు. అనంతరం గిరిధర్‌రె డ్డి లోకేశను సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-28T00:25:22+05:30 IST