ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్‌క్రాస్‌ భవంతికి తాళం

ABN, First Publish Date - 2023-01-10T00:12:30+05:30

రెడ్‌ క్రాస్‌ భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌.. బిల్లులు ఇవ్వకపోవడంతో విసిగిపోయి తాళం వేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. 2019లో అనంతపురం పాతూరు సీడీ ఆస్పత్రి ఆవరణలో రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఢిల్లీకి చెందిన ఆర్‌ఈసీ సంస్థను అప్పటి కలెక్టర్‌ సంప్రదించి, భవన నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరారు.

పాతూరులోని రెడ్‌ క్రాస్‌ కార్యాలయానికి వేసిన తాళం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిల్లులు చెల్లించని ఫలితం

పోలీసుల వద్ద కాంట్రాక్టర్‌ గోడు

అనంతపురం టౌన, జనవరి 9: రెడ్‌ క్రాస్‌ భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌.. బిల్లులు ఇవ్వకపోవడంతో విసిగిపోయి తాళం వేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. 2019లో అనంతపురం పాతూరు సీడీ ఆస్పత్రి ఆవరణలో రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఢిల్లీకి చెందిన ఆర్‌ఈసీ సంస్థను అప్పటి కలెక్టర్‌ సంప్రదించి, భవన నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరారు. అప్పటి అంచనాల ప్రకారం భవన నిర్మాణానికి రూ.92.39 లక్షలు, పరికరాలు, ఫర్నిచర్‌కు మరో రూ.40 లక్షలు ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకరించింది. టెండరు ద్వారా అంచనా మొత్తానికి (రూ.92.39 లక్షలు) భవనాన్ని నిర్మించేందుకు నిత్యానంద అనే కాంట్రాక్టర్‌ ముందుకు వచ్చారు. 2-3-2019న అగ్రిమెంట్‌ చేసుకున్నారు. 2021లో పనులు పూర్తి చేశారు. అదనంగా మరిన్ని పనులు చేయించడంతో ఖర్చు రూ.1.22 కోట్లకు చేరింది. ఇందులో రూ.94.47 లక్షలు మంజూరు చేశారు. మరో రూ.27.81 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉంది. అయినా కార్యాలయాన్ని ప్రారంభించాలని చూశారు. దీంతో కాంట్రాక్టర్‌ కలెక్టర్‌ను కలిసి, బిల్లులు చెల్లించాక ప్రారంభించాలని కోరారు. దీంతో రెండుసార్లు వాయిదా వేశారు. చివరకు 2022 జూలైలో రెడ్‌క్రాస్‌ దినోత్సవం సందర్భంగా పైస్థాయి నుంచి ఒత్తిళ్ళు రావడంతో కలెక్టర్‌ నాగలక్ష్మి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ రోజు కూడా కాంట్రాక్టర్‌ కలెక్టర్‌ను కలిసి, తమకు బిల్లులు మంజూరు చేయాలని కోరారు. తప్పకుండా మంజూరు చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఆ తరువాత మూడుసార్లు కలెక్టర్‌ను కలిసినా ఫలితం లేకపోయిందని కాంట్రాక్టర్‌ వాపోయారు. ఒకదశలో రెడ్‌క్రాస్‌ ఖాతాలో ఉన్న రూ.10 లక్షలను చెల్లించాలని కలెక్టర్‌ సూచించినా, ఆ సంస్థవారు పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. పైగా రెడ్‌ క్రాస్‌ కార్యాలయానికి వెళ్లి బిల్లులు అడిగితే, రెడ్‌క్రాస్‌ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడారని అన్నారు. అందుకే తాళం వేయాల్సి వచ్చిందని అన్నాడు.

పోలీస్‌ స్టేషనలో పంచాయితీ...

రెడ్‌ క్రాస్‌ కార్యాలయానికి కాంట్రాక్టర్‌ తాళం వేయడంతో రెడ్‌క్రాస్‌ అధికారులు త్రీ టౌన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రవిశంకర్‌ రెడ్డి కాంట్రాక్టర్‌ను పిలిపించి మాట్లాడారు. చట్టప్రకారం అలా చేయడం తప్పని అన్నారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇప్పించాలని రెడ్‌ క్రాస్‌ వారికి సూచించారు. సీఐ సూచనలతో కాంట్రాక్టర్‌ తాళం చెవిని రెడ్‌క్రాస్‌ వారికి అప్పగించారు. బకాయి బిల్లులను చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారమౌతుందని రెడ్‌క్రాస్‌ సొసైటీ సెక్రటరీ మోహనకృష్ణ అన్నారు.

Updated Date - 2023-01-10T00:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising