వైద్యుల అలసత్వం.. రోగులకు అందని వైద్యం
ABN, First Publish Date - 2023-04-07T23:55:50+05:30
పట్టణంలోని ప్రభుత్వ ఆ సుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం పేదలకు శాపంగా మారుతోందన్న విమ ర్శలున్నాయి. పలువురు డాక్టర్ల తీరుపై రోగులు పెదవి విరుస్తున్నా రు.
పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు రెఫర్
మధ్యాహ్నం తర్వాత అందుబాటులో ఉండని డాక్టర్లు
హిందూపురం అర్బన, ఏప్రిల్ 7: పట్టణంలోని ప్రభుత్వ ఆ సుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం పేదలకు శాపంగా మారుతోందన్న విమ ర్శలున్నాయి. పలువురు డాక్టర్ల తీరుపై రోగులు పెదవి విరుస్తున్నా రు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు వందశాతం పేదలే. వైద్యం కో సం వస్తే ఇక్కడ పనిచేసే వైద్యులు కొంతమంది సొంత క్లినిక్‌లకు రెఫర్ చేస్తున్నారని రోగుల బంధువులు చెబుతున్నారు. ఇక్కడ పరికరాలు, వైద్యం అంతంత మాత్రమేనని, బయట క్లినిక్‌లకు వస్తే అ క్కడ అన్ని సేవలు అందుతాయని, వారికి ప్రభుత్వం వైద్యం అం దించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు వై ద్యులకు బయట క్లినిక్‌లు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి కన్నా ఎ క్కువ సమయం అక్కడే కేటాయిస్తున్నారని ఆసుపత్రి వర్గాలే అం టున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే వెళ్ళి పోతున్నారు. ఇ దిలాఉండగా కొంతమంది వైద్యులు రోగులకు టెస్ట్‌ల పేరుతో బయటకు పంపుతున్నారు. టెస్టుల ఖరీదు ఎక్కువగా ఉందని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. టెస్టు చేయించుకుంటేనే వైద్యం సక్రమంగా చేయవచ్చని, లేకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. రోగులు ప్రాణ భయంతో అప్పు చేసి మరీ టెస్టులు చేసుకుంటున్నారని తెలుస్తోంది. కాదు, కూడదు అంటే... కేసు సీరియ్‌సగా ఉంది, ఇక్కడ మేము చేయలేమని, ఏ మైనా అయితే మా బాధ్యత కాదు అని భయపెట్టి రెఫర్ చేస్తున్నారని వాపోతున్నారు. కొంతమంది రెఫర్ చేయించుకొని అనంతపురం పెద్ద ఆసుపత్రులకు వెళ్తున్నారు. గైనిక్, చిన్న పిల్లల వార్డులో ఇలాంటి పరిస్థితి ఉందని తెలుస్తోంది.
రూ.20 కోట్లతో మాతాశిశు కేంద్రం
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ.20 కోట్లతో అన్ని సదుపాయాలతో జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. పుట్టిన బిడ్డ నుం చి గర్భవతులు, బాలింతలకు, నవజాత శిశువులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. తగినంతమంది వైద్యు లు, వసతులు, పరికరాలు, మందులు అందుబాటులో ఉండేవి. అధికారులు చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలని కోరుతున్నారు.
Updated Date - 2023-04-07T23:55:50+05:30 IST