ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంత పురంలో కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు..

ABN, First Publish Date - 2023-05-29T23:30:42+05:30

ప్రశాంతంగా ఉన్న హిందూపురంలో వీ ధుల పేర్లు మార్చుతూ అధికార పార్టీ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలతో కొత్త సమస్యలు తలెత్తుతాయని ఆ ప్రాంత వాసులతోపాటు బీజేపీ నాయకులు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్పీజీటీ రోడ్డు వీధిపేరు మార్పుపై మండిపడ్డ జనం

హిందూపురం, మే 29: ప్రశాంతంగా ఉన్న హిందూపురంలో వీ ధుల పేర్లు మార్చుతూ అధికార పార్టీ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలతో కొత్త సమస్యలు తలెత్తుతాయని ఆ ప్రాంత వాసులతోపాటు బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఆర్పీజీటీ రోడ్డుకు వీధి పేరు మా ర్చుతూ మున్సిపల్‌ ఎజెండాలో పొందుపరచడాన్ని వ్యతిరేకిస్తూ సోమ వారం ఆందోళనకు దిగారు. విశ్వహిందూపరిషత, హిందూసంఘాలు, బీజేపీ నాయకులు, స్థానికులతో కలిసి పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని 30వ వార్డులో ఉ న్న ఆర్పీజీటీ రోడ్డు, దండు రోడ్డుగా పిలువబడే దానిని మార్చాలని ఆ ప్రాంత కౌన్సిలర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తున్నామని, వెంటనే విరమించుకోవాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎ త్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హిందూపురంలో అన్ని మతాలవారు కలిసి సోదరభావంతో ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఎ న్నో దశాబ్దాలుగా ఉన్న పేర్లను మార్చడం వల్ల లేని సమస్యలు వస్తాయన్నారు. అధికార పార్టీ నాయకులు అభివృద్ధివైపు చూడాలేతప్ప.. ఇలా పేర్లు మార్చడం సబబు కాదన్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌, ఇనచార్జి తహసీల్దార్‌ ప్రసాద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సనకు వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2023-05-29T23:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising