ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటిపట్టాల కోసం లబ్ధిదారుల ఆందోళన

ABN, First Publish Date - 2023-06-03T00:05:28+05:30

ఇళ్లు లేని పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో కలసి బైఠాయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనకల్లు, జూన 2: ఇళ్లు లేని పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో కలసి బైఠాయించారు. కార్యాలయంలోకి అధికారులు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదల ఇంటి పట్టాల కోసం పలుమార్లు అధికారులు చుట్టు తిరిగినా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. ఇంటిపట్టాలు మంజూరు చేసేవరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. అనంతరం తహసీల్దార్‌ మధునాయక్‌కు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్‌ స్పందిస్తూ, గ్రామసచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్ల ద్వారా దరఖాస్తులు ఆనలైనలో పంపాలన్నారు. దీనికి లబ్ధిదారులు మాట్లాడుతూ, డిజిటల్‌ అసిస్టెంట్ల వద్దకు వెళ్లితే ఇక్కడ దరఖాస్తులు ఆనలైన చేయడానికి లేదని చెబుతున్నట్లు వాపోయారు. ఆనలైన నమోదుకు డిజిటల్‌ అసిస్టెంట్లను ఆదేశిస్తామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. నిరసనలో సీపీఎం, రైతు సంఘం నాయకులు శివన్న, రమణ, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising