జన జాతర
ABN, First Publish Date - 2023-04-19T00:08:54+05:30
పట్టణంలోని శ్రీకంఠపురంలో గ్రామదేవత ముత్యాలమ్మ జాతర జన సంద్రమైంది. ఆలయ పరిసర ప్రాంతాలు విద్యుద్దీపకాంతులతో విరజిమ్మాయి. అమ్మవారి దర్శనం, ఊరేగింపునకు భక్తు లు పోటెత్తారు.
అట్టహాసంగా ముత్యాలమ్మ ఊరేగింపు
హిందూపురం అర్బన, ఏప్రిల్ 18: పట్టణంలోని శ్రీకంఠపురంలో గ్రామదేవత ముత్యాలమ్మ జాతర జన సంద్రమైంది. ఆలయ పరిసర ప్రాంతాలు విద్యుద్దీపకాంతులతో విరజిమ్మాయి. అమ్మవారి దర్శనం, ఊరేగింపునకు భక్తు లు పోటెత్తారు. మహిళలు జ్యోతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నా రు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి అమ్మవారి విగ్రహాల ఊరేగింపు ప్రారంభించారు. పొలిమేర శ్రీకంఠపురం చెరువు కట్ట వద్ద అర్ధరాత్రి అమ్మవారికి తొలి మొక్కుబడి ఆనవాయితీగా చెల్లించారు. బంధుమిత్రులతో సందడి నెలకుంది. ఏ వీధి, ఇల్లు చూసినా జనంతో కిటకిటలాడాయి. పలు వీధుల్లో ట్రాఫిక్ స్తంభించింది. మూడు నెలల పాటు ముత్యాలమ్మ దేవి విగ్రహం గ్రా మంలోని ప్రతి ఇంటికి వెళ్ళి పూజలందుకుంటుంది. ప్రతి ఐదేళ్లకోమారు జా తర చేయడం ఆనవాయితీ. మంగళవారం అమ్మవారికి మహిళలు జ్యోతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు బందోబస్తు చేపట్టారు.
తురకలాపట్నంలో రాతిదూలం లాగుడు పోటీలు
రొద్దం: మండలంలోని తురకలాపట్నం గ్రామంలో మంగళవారం గ్రామస్థులు రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించారు. జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీలు తిలకించేందుకు జనం తరలివచ్చారు. ఇ టీవల ఎల్‌జీబీనగర్ సమీపంలోని బైలాంజనేయస్వామి విశేష పూజలు నిర్వహించగా రాతిదూలం పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి కింద రాంగోపాల్, రెండో బహుమతి రమేష్, మూడో బహుమతి తిమ్మయ్య వృషభాలు ఎంపికయ్యాయి.
గుంతపల్లిలో సొప్పలమ్మ వేడుక
గోరంట్ల: మండలంలోని గుంతపల్లిలో సొప్పలమ్మదేవి జాతర వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. పురాతన ఆలయ స్థానంలో పుట్టగుండ్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద నూతన ఆలయాన్ని రెండేళ్ల క్రితం నిర్మించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మంగళవారం మహిళలు భక్తిశ్రద్ధలతో జ్యో తులు మోసారు. మంగళవాయిద్యాలతో సొప్పలమ్మ గుడివరకు ప్రదర్శనగా వెళ్లారు. ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి శాంతిపూజలు జ రిపారు. వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలతో మంచి దిగుబడుగు లభించాలని చీడపీడల నుంచి కాపాడాలని అమ్మవారిని ప్రార్థించారు. గ్రామస్థులు బంధువులు, స్నేహితులను జాతరకు ఆహ్వానించి విందు భోజనాలతో సంబ రం అంబరాన్ని అంటింది.
Updated Date - 2023-04-19T00:08:54+05:30 IST