ఇసుక కష్టాలు
ABN, First Publish Date - 2023-04-21T23:39:54+05:30
యోజకవర్గంలో ఇసుక కొరత కారణం గా ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఇసుకకు బదులు ఫ్యాక్ట రీలలో తయారయ్యే ఎకోశ్యాండ్‌ను వాడుతున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాల వ్యయం కూడా పెరుగుతోందని వినియోగదారులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.
రీచల ఊసేలేదు...
ప్రత్యామ్నాయంగా ఎకోశ్యాండ్
తడిసి మోపెడవుతున్న ఖర్చు
భవన నిర్మాణ రంగం కుదేలు
ఉపాధి కరువై కూలీల వలస
మడకశిర, ఏప్రిల్ 21: నియోజకవర్గంలో ఇసుక కొరత కారణం గా ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఇసుకకు బదులు ఫ్యాక్ట రీలలో తయారయ్యే ఎకోశ్యాండ్‌ను వాడుతున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాల వ్యయం కూడా పెరుగుతోందని వినియోగదారులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. కూలీలకు కూడా పూర్తిస్థాయిలో ఉపాధి దొరకడం లే దు. జీవనోపాధి కోసం వ్యవసాయ, మట్టి పనులకు వెళ్తున్నారు. నియోజకవర్గంలో ఇసుక రీచలు కూడా లేవు. ఇసుక రీచలను ఏర్పాటుచేసి ఇసుకను అందుబాటులోకి తెస్తే ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కా వడంతో పాటు కూలీలకు కూడా ఉపాధి దొరుకుతుందని పేర్కొంటున్నారు. ఇసుక కొరత తీవ్రంగా ఉండడంతో ఇళ్ల నిర్మాణదారులు చిక్కబళ్లాపూర్, పావగడలోని ఫ్యాక్టరీలలో తయారయ్యే శాండ్‌ను వాడుతున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాల వ్యయం కూడా పెరుగుతోంది. ఈ శ్యాం డ్‌ను కాంక్రీట్, గోడల నిర్మాణానికి, ఎం శ్యాండ్‌ను ప్లాస్టింగ్‌కు వాడుతున్నారు. ఎకోశ్యాండ్ 3.5 టన్నులు కలిపితే ట్రాక్టరులోడు ఇసుకతో స మానం. ఎం శ్యాండ్ టన్ను రూ.850, 3.5 టన్నులకు రూ.3 వేలు అవుతోంది. ఇసుక అయితే ట్రాక్టరు లోడు రూ.1500లకే దొరుకుతోంది. ఈ శ్యాండ్ టన్ను రూ.1450 చొప్పున 3.5 టన్నుకు రూ.5070 అవుతోంది. ట్రాక్టరు లోడుకు రూ.2 వేలకే దొరుకుతోందని ఇళ్ల నిర్మాణదారులు అంటున్నారు. గతంలో ఇసుక అందుబాటులో ఉన్న సమయంలో ఇళ్ల నిర్మాణాలు చదరం రూ.1.10 లక్షలతో చేపట్టేవారు. ప్రస్తుతం ఇసుక కొరత కారణంగా చదరం రూ.1.30 వేల నుంచి రూ.1.40 లక్షలకు పెరిగింది. దీంతో ఇళ్ల నిర్మాణాల వ్యయం కూడా పెరిగింది. ఇసుకను అం దుబాటులోకి తెస్తే ఇళ్ల నిర్మాణాల వ్యయం తగ్గే అవకాశముందని పే ర్కొంటున్నారు. దీనిపై ఎంపీడీఓను వివరణ కోరగా, మడకశిర ప్రాం తంలో ఇసుక రీచలు లేవని తెలిపారు. పొలాల సమీపంలో, వంకల్లో ఉన్న ఇసుకను ఎద్దులబండ్లలో తోలుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకోవ చ్చు. ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు తదితర వాటికి ఇసుక అవసరమైతే సచివాలయాల నుంచి అనుమతులను ఇప్పిస్తున్నామని తెలిపారు.
వ్యవసాయ పనులకు వెళుతున్నాం..
- మారేగౌడ్, కూలీ, అగ్రహారం
స్థానికంగా ఇళ్ల నిర్మాణాల పనులు లేవు. దీంతో వ్యవసాయ పనులు, సమీప కర్ణాటక ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణాల పనులకు వెళ్ళాల్సి వస్తోంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. ప్రస్తుతం స్థానికంగా పనులు దొర కడం కష్టసాధ్యంగా ఉంది. ప్రధానంగా ఇసుక కొరత వెంటాడుతోంది. ఇళ్ళ నిర్మాణాలు కూ డా అరకొర జరుగుతున్నాయి, ఇసుక సమస్య పరిష్కారమైతే పనులు దొరుకుతాయి. కూలీల కడుపు నిండుతుంది.
ట్రాక్టర్ లోన కంతు కూడా కట్టలేకపోతున్నారు...
- దొడ్డ లింగప్ప, అగ్రహారం
ట్రాక్టర్‌కు బ్యాంకులో లోను తీసుకున్న వా రు కొందరు వాటి కంతు, వడ్డీ కూడా కట్టలేక పోతున్నారు. తమ పొలం సమీపంలో ఉన్న వంకల ఇసుకను కూడా ఉచితంగా ఇంటి ని ర్మాణానికి ట్రాక్టర్‌లో తోలుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ట్రాక్టర్ లోడు చేసేందు కు కూలీలకు రూ.600 చెల్లించాలి. గతంలో ఇళ్ళ నిర్మాణాలకు ఇసుక బాడుగకు తోలేవా ళ్లం. బ్యాంకు కంతు చెల్లించే వాళ్ళం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
Updated Date - 2023-04-21T23:39:54+05:30 IST