ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు : టీడీపీ

ABN, First Publish Date - 2023-04-23T23:53:36+05:30

వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల కాలంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని పెనుకొండ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు చిన్నప్పయ్య విమర్శించా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం, ఏప్రిల్‌ 23: వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల కాలంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని పెనుకొండ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు చిన్నప్పయ్య విమర్శించా రు. ఆదివారం మండలంలోని పెద్దగువ్వలపల్లిలో పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టారు. ఇసుక ధరలు అమాంతం పెంచేసి, సామాన్యుడు ఇల్లు కట్టుకునేందుకు చుక్క లు చూపిస్తున్నారన్నారు. వంట గ్యాస్‌, విద్యుత చార్జీలు, సిమెంటు ధరలు విపరీతంగా పెంచేశారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్న ప్రభుత్వం కాలయాపన చేస్తూ కుచ్చుటోపీ పెట్టిందన్నారు. మండలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే కనపడుతున్నాయన్నారు. వచ్చేఎన్నికల్లో చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని బలపరచాలన్నారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇనచార్జి నాగేంద్ర, రవి, వెంకటరాముడు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజలను బాదుతున్న ప్రభుత్వం

హిందూపురం, ఏప్రిల్‌ 23: వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలపై భా రం మోపుతూనే ఉందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఆదివారం పట్టణ పరిధిలో ని చౌడేశ్వరీ కాలనీలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అధోగతి పా లైదందన్నారు. ప్రజలపై పన్నులు బాదుతూనే ఉన్నారన్నారు. చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం, బెదిరించడం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీసీసెల్‌ నాయకులు రవీంద్రనాయుడు, రవి, ప్రసాద్‌, భార్గవ్‌, టీడీపీ నాయకు లు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా సింగిరెడ్డిపల్లిలో టీడీపీ కోఆర్డినేటర్‌ శ్రీనివా్‌సరావు, చంద్రమోహన, నారాయణరెడ్డి, సింగిరెడ్డిపల్లి బాబా, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-04-23T23:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising