ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమర్శలు మాని.. అభివృద్ధిపై దృష్టి పెట్టు

ABN, First Publish Date - 2023-06-12T00:12:20+05:30

శాసనసభ్యునిగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి... ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాల్సింది పోయి, టీడీపీపై విమర్శలు చేయడం తగదని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హితవుపలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యేకు పల్లె హితవు

పుట్టపర్తి, జూన 11: శాసనసభ్యునిగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి... ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాల్సింది పోయి, టీడీపీపై విమర్శలు చేయడం తగదని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హితవుపలికారు. ఆదివారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని శిల్పారామం గుట్ట కాలనీలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్థానికులు పలు సమస్యలను పల్లె దృష్టికి తెచ్చారు. అనంతరం పల్లె మాట్లాడుతూ టీడీపీ పాలనలో 1174 మందికి రెండ్లు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేశామన్నారు. ఇందులో 674 గృహాలకు రూ.2.50 లక్షల చొప్పున మంజూరు చేశామన్నారు. కాలనీలో మౌళిక వసతుల కోసం మరో రూ.11.5 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే.. కాలనీలో ఒక ఇల్లు కూడాకట్టించలేదని, స్థానిక సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. పట్టణానికి దూరంగా సెంటు స్థలం ఇచ్చి, జగనన్నకాలనీ పేరిట ఆర్భాటానికి సరిపెట్టారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు మంజూరు చేయలేదని, రూ.1.80 లక్ష ఇస్తే పేదలు ఇళ్లు ఎలా కట్టుకుంటారంటూ ప్రశ్నించారు.

Updated Date - 2023-06-12T00:12:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising