తల్లి మందలించిందని విద్యార్థి ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-06-11T00:11:31+05:30
పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నివాసముంటున్న విద్యార్థి తరుణ్ కుమార్ (15)... తల్లి మందలించిందని శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు.
కదిరి అర్బన, జూన 10: పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నివాసముంటున్న విద్యార్థి తరుణ్ కుమార్ (15)... తల్లి మందలించిందని శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. తరుణ్ కుమార్ సరిగ్గా పాఠశాలకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. దీంతో తల్లి ప్రేమలత మందలించగా, మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2023-06-11T00:11:31+05:30 IST