ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన సబ్‌ కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-04-07T00:00:44+05:30

పదో తరగతి పరీక్షలు జిల్లావ్యాప్తంగా సజావుగా సాగుతున్నాయి. గురువారం రెండోరోజు హిందీ పరీక్ష జ రిగింది. పెనుకొండలో పలు పరీక్ష కేంద్రాలను సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌, డీ ఈఓ మీనాక్షి, తహసీల్దార్‌ భాగ్యలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీలు చేశా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెనుకొండ, ఏప్రిల్‌ 6: పదో తరగతి పరీక్షలు జిల్లావ్యాప్తంగా సజావుగా సాగుతున్నాయి. గురువారం రెండోరోజు హిందీ పరీక్ష జ రిగింది. పెనుకొండలో పలు పరీక్ష కేంద్రాలను సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌, డీ ఈఓ మీనాక్షి, తహసీల్దార్‌ భాగ్యలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీలు చేశా రు. పరీక్షల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలో మూడు పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న టెన్త పరీక్షల్లో హిందీ పరీక్షలకు ఎనిమిది మంది గైర్హాజరయ్యారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలో 171 మందికి గాను నలుగురు, బాలికల ఉన్నత పాఠశాలలో 201 మందికి గాను ఒకరు, బాలికల ఉన్నత పాఠశాలలో 260 మందికి గాను ముగ్గురు గైర్హాజరైనట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ జ్యో తిర్మయి, చంద్రశేఖర్‌, గంగప్ప తెలిపారు.

గోరంట్లలో 17 మంది గైర్హాజరు

గోరంట్ల: పట్టణంలోని ఏడు పరీక్షా కేంద్రాల్లో రెండోరోజు గురువారం జరిగిన పదోతరగతి హిందీ పరీక్షకు 17మంది విద్యార్థులు గై ర్హాజరైనట్లు ఎంఈఓ గోపాల్‌నాయక్‌ తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని ఆ ర్‌జేడీ ప్రతా్‌పరెడ్డి తనిఖీచేశారు. అనంతరం ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో రికార్డులు పరిశీలించారు. హెచఎం నూర్‌మహ్మద్‌ సమక్షం లో విద్యార్థుల ప్రతిభాపాఠవాలపై ఆరా తీశారు. కాగా డీఈఓ కా ర్యాలయం నుంచి ఏడీ నాగరాజు, ఎంపీడీఓ రఘునాథ్‌గుప్త పరీక్షాకేంద్రాలను పరిశీలించారు. మౌళిక సదుపాయాల ఏర్పాట్లపై ఆరాతీశారు. బాలుర ఉన్నత పాఠశాలలో 176 మందికి 177 మంది, శ్రీ చైతన్యలో 174 మందికి 168 మంది, బాలికల పాఠశాలలో 172 మందికి 169, మాంటిస్సొరిలో 170 మందికి 169, వివేకానందలో 180 మందికి 179మంది, ఉర్దూ పాఠశాలలో 100మందికి వంద శా తం, ఉదయ్‌కిరణ్‌ పాఠశాలలో 172 మందికి 168మంది విద్యార్థు లు పరీక్షలు రాశారు. మొత్తం 1142 మందికి గాను 1125 మంది వి ద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.

పురంలో డీఈఓ తనిఖీలు

హిందూపురం అర్బన: పదో తరగతి హిందీ పరీక్ష రెండవ రో జు గురువారం సజావుగా జరిగింది. డీఈఓ మీనాక్షి పట్టణంలో ప రీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఫోనలు అందుబాటులో లేని కారణంగా డీఈఓ వస్తున్న విషయం ముందస్తుగా ఎవరికీ తెలియలే దు. ఆమె వేలాంగినిమాత పాఠశాల, అజీజియా, నేతాజీ, బాలయే సు పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌ కు విద్యార్థులు పాటుపడలేదు. ఉపాధ్యాయులు ఫోనలు ఉపయోగిస్తున్నా, బయట నుంచి ఎవరైనా ఏ విధమైన ప్రయోగాలు చేస్తున్నారా? అని పరిశీలించారు.

లేపాక్షి: మండలవ్యాప్తంగా మూడు కేంద్రాల్లో గురువారం పదో తరగతి హిందీ పరీక్ష సజావుగా నిర్వహించినట్లు ఎంఈఓ నాగరాజునాయక్‌ తెలిపారు. 771 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉం డగా, 661 మంది హాజరయ్యారన్నారు. విద్యార్థులకు అన్ని వసతు లు కల్పించినట్లు తెలిపారు.

Updated Date - 2023-04-07T00:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising