టాటాఏస్, లారీ ఢీ.. డ్రైవర్ మృతి
ABN, First Publish Date - 2023-06-05T23:57:23+05:30
మండలంలోని దేవిరెడ్డిపల్లి మోడల్ స్కూల్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం టాటాఏస్, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా కురుకుమలై గ్రామానికి చెందిన డ్రైవర్ జ్యోతి(33) అక్కడికక్కడే మృతి చెందాడు.
నల్లచెరువు, జూన 5: మండలంలోని దేవిరెడ్డిపల్లి మోడల్ స్కూల్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం టాటాఏస్, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా కురుకుమలై గ్రామానికి చెందిన డ్రైవర్ జ్యోతి(33) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. జ్యోతి అనంతపురంలో చిప్స్-లేస్ వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డాడు. తమిళనాడులోని స్వగ్రామానికి చెందిన స్నేహితుడు ప్రభాకర్‌కు టాటా ఏస్ వాహనం ఉంది. తన వద్దే అనంతపురంలో ఉండి వ్యాపారం చేసుకుందామని స్నేహితునితో కలిసి ఇద్దరూ టాటాఏస్ వాహనంలో వస్తున్నారు. తనకల్లు వరకు వాహనాన్ని ప్రభాకర్ నడిపారు. అక్కడ టీతాగి, అనంతరం జ్యోతి డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. మోడల్ స్కూల్ వద్ద స్పీడు బ్రేకర్లు ఉండడంతో ముందు వైపు వస్తున్న లారీ బ్రేక్ వేయడంతో, వెనుకవైపు వస్తున్న టాటాఏస్ ఢీకొంది. ప్రమాదంలో జ్యోతి వాహనంలోని డ్రైవర్ సీట్లోనే ఇరుక్కుని, అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభాకర్ తీవ్రంగా గాయపడగా, గ్రామస్థులు 108 అంబులెన్స లో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ షేక్షావలి, కానిస్టేబుల్ ప్రసాద్ నాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2023-06-05T23:57:23+05:30 IST