ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తమ్ముళ్లలో నూతనోత్సాహం

ABN, First Publish Date - 2023-06-22T00:43:37+05:30

తెలుగు తమ్ముళ్లు మరో యాత్రకు సిద్ధమయ్యారు. యూవగళం పాదయాత్ర సూపర్‌ సక్సస్‌ కావడంతో నూతనోత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు బస్సు యాత్రకు సన్నద్ధమయ్యారు. భవిషత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన చైతన్య బస్సుయాత్ర ఈనెల 23వ తేదీన జిల్లాలో ప్రారంభం కానుంది.

భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర బస్సుల ప్రారంభోత్సవంలో చంద్రబాబుతో టీడీపీ ఉమ్మడి జిల్లా నేతలు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపటి నుంచి జిల్లాలో టీడీపీ బస్సు యాత్ర

టీడీపీ హయాంలో అభివృద్ధిపై ప్రజల్లో చర్చ

మినీ మేనిఫెస్టోపై ప్రచారం

పుట్టపర్తి, జూన 21(ఆంధ్రజ్యోతి): తెలుగు తమ్ముళ్లు మరో యాత్రకు సిద్ధమయ్యారు. యూవగళం పాదయాత్ర సూపర్‌ సక్సస్‌ కావడంతో నూతనోత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు బస్సు యాత్రకు సన్నద్ధమయ్యారు. భవిషత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన చైతన్య బస్సుయాత్ర ఈనెల 23వ తేదీన జిల్లాలో ప్రారంభం కానుంది. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలతో మమేకమయ్యేలా రూట్‌మ్యాప్‌ రూపొందించారు. రానున్నది ఎన్నికల కాలం కావడంతో టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ప్రకటించిన తొలి విడత మేనిఫెస్టోపై ప్రజల్లో చర్చ పెట్టనున్నారు. టీడీపీ హయంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వైసీపీ వచ్చాక ఆపేసిన వాటితోపాటు నాలుగేళ్ల వైసీపీ పాలన వైఫల్యాలను ఎత్తిచూసేలా కార్యక్రమాలు రూపొందించారు. జిల్లాలో ఐదు రోజుల పాటు సాగే యాత్రలో జోన-5 కింద టీడీపీ నేతలంతా ఉమ్మడిగా బస్సుయాత్రలో పాల్గొననున్నారు. ఇదివరకే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర జిల్లా శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. అదే ఊపుతో బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు శ్రేణులు సిద్ధంగా ఉన్నారు.

వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ..

టీడీపీ మినీ మేనిఫెస్టోలోని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. యాత్రలో దారి పొడవునా ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ సాగనుంది. టీడీపీ హయంలో చేపట్టిన అభివృద్ధి, మంజూరు చేసిన పనులపై ఆయా నియోజకవర్గాల్లో ప్రజలతో చర్చ పెట్టనున్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి పనులు చేపట్టిన ప్రాంతాల మీదుగా యాత్ర సాగనుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆపేసిన పనులను ఎత్తిచూపుతూ చర్చలు, సెల్ఫీ చాలెంజ్‌లతో సవాల్‌ విసరనున్నారు. ఇటీవల యువగళం పేరుతో నారా లోకేశ చేపట్టిన పాదయాత్రలో టీడీపీ హయాంలో చేపట్టిన అభివద్ధి పనులు, ప్రాజెక్టులు, పరిశ్రమల వద్ద సెల్ఫీ చాలెంజ్‌తో వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. ఇదేస్థాయిలోనే బస్సు యాత్రలో టీడీపీ నేతలు.. వైసీపీకి సవాల్‌ విసరనున్నారు. యాత్రలో రోజూ నియోజకవర్గంలో యాత్ర సాగించి, అదేరోజు రాత్రి ఆ ప్రాంతలోనే పల్లెనిద్ర చేస్తారు. మినీ మేనిఫెస్టోపై ప్రజల వద్ద చర్చ పెట్టి, స్థానికులతో మమేకం కానున్నారు. యాత్రను విజయవంతం చేసేందుకు రెండు రోజులుగా కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం, మడకశిర, హిందూపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో టీడీపీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

మేనిఫెస్టోపై ప్రచారం

గతనెల 28వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో టీడీపీతోనే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ప్రకటించిన మేనిఫెస్టో సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. రానున్న ఐదేళ్లలో రూ.6లక్షల మేర ప్రతి ఇంటికి ఆదాయం ఎలా సమకూర్చబోతుందో ప్రజలకు వివరిస్తారు. ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా.. 18 నుంచి 59 ఏళ్లలోపు వారికి నెలకు రూ.1500, ఇంట్లో చదువుకునే పిల్లలకు ఎంతమంది ఉన్నా ఏడాదికి రూ.15వేలు ఇవ్వనున్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పరిశ్రమలు, కంపెనీలు తేవడం ద్వారా యువత కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు, రైతే రాజు కింద అన్నదాతకు ఏడాదికి రూ.20వేలు సాయం తదితర మేనిఫెస్టోలోని అంశాలను వివరించనున్నారు.

కదిరిలో ప్రారంభం

జిల్లాలో బస్సు యాత్రకు కదిరిలో శ్రీకారం చుట్టనున్నారు. జోన-5 పార్లమెంటు పరిధిలో 25 రోజులపాటు సాగనుంది. శుక్రవారం కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి, బస్సుయాత్ర ప్రారంభిస్తారు. అదేరోజు నియోజకవర్గంలో కొనసాగుతుంది. 24న పుట్టపర్తి, 25న పెనుకొండ, 26న మడకశిర నియోజక వర్గాల్లో యాత్ర సాగనుంది. అనంతరం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. 27న కళ్యాణదుర్గం, 28న రాయదుర్గం, 29న రాప్తాడు, 30న అనంతపురం అర్బన, జూలై 1న శింగనమల, 2న గుంతకల్లు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. యాత్రలో ఉమ్మడి జిల్లా నేతలు పాల్గొననున్నారు.

Updated Date - 2023-06-22T00:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising