టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN, First Publish Date - 2023-06-15T00:07:34+05:30
టీడీపీ మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆపార్టీ శ్రేణులకు సూచించారు.
- మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
నల్లమాడ, జూన 14: టీడీపీ మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆపార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం స్థానికంగా మండల కన్వీనర్ మైలే శివశంకర్ అధ్యక్షతన టీడీపీ క్లస్టర్ ఇనచార్జిలు, బూత కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పల్లె మాట్లాడుతూ నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందన్నారు. ఏడు దఫాలుగా విద్యుత బిల్లులు పెంచి, పేదల నడివిరుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటా వివరిస్తూ, నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన మేనిఫెస్టోతో అందే లబ్ధిని తెలియజేయాలన్నారు. టీడీపీ పాలనలో రైతులకు పలురకాల సంక్షేమపథకాలు, వృత్తిదారులకు పనిముట్లు అందించామన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ గెలుపునకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మైలే రామచంద్ర, సలాంఖాన, బుట్టి నాగభూషణంనాయుడు, మాజీ కన్వీనర్ కేశవరెడ్డి, సర్పంచు ప్రభాకర్‌రెడ్డి, కులశేఖర్‌నాయుడు, గనరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, గడ్డం రమణారెడ్డి, పద్మనాభరెడ్డి, గుండ్ర శివారెడ్డి, భూవనేశ్వర్‌రెడ్డి గంగులప్పనాయుడు, నాగరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, పుట్ల రవీంద్ర, శ్రీరాములు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
నల్లమాడ మండలం రెడ్డిపల్లి, తిప్పయ్యగారిపల్లి, ఎర్రవంకపల్లి గ్రామాల్లో టీడీపీ నాయకులు నాగప్ప, రామచంద్ర, అన్నం లక్ష్మీనారాయణ అనారోగ్యంతో బాధపడుతుండగా, విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రఘునాథరెడ్డి వారిని పరామర్శించారు. ఆర్థికసాయం అందించారు.
Updated Date - 2023-06-15T00:07:34+05:30 IST