గ్రామస్థాయి నుంచి టీడీపీని బలోపేతం చేయాలి
ABN, First Publish Date - 2023-06-14T00:13:39+05:30
ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నుంచి టీడీపీ బలోపేతం కోసం కృషి చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
అమడగూరు, జూన 13: ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నుంచి టీడీపీ బలోపేతం కోసం కృషి చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారరం స్థానిక చౌడేశ్వరి కల్యాణ మండపంలో టీడీపీ బూత కమిటీ కన్వీనర్లు, క్లస్టర్ ఇనచార్జిలు, యూనిట్ ఇనచార్జిలు, మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెతో పాటు పుట్టపర్తి నియోజకవర్గ అబ్జర్వర్ బచ్చల పుల్లయ్య మాట్లాడారు. బూతస్థాయి కన్వీనర్లు కీలకంగా పని చేయాలని సూచించారు. ఆయా బూతలెవల్‌లో పార్టీ సానుభూతిపరులు, అభిమానులను గుర్తించి, పార్టీ వైపు మొగ్గుచూపేలా కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన రాక్షస పాలనలో శాంతిభద్రతలు దారి తప్పాయన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. సిమెంటు, ఇసుక, స్టీలు ధరలు విపరీతంగా పెంచి, సామాన్యులు కొనుగోలు చేయలేక ఇళ్లు కట్టుకోలేక అల్లాడిపోతున్నట్లు పేర్కొన్నారు. నాలుగేళ్లలో ఎనిమిది సార్లు విద్యుత చార్జీలు పెంచారని, కరెంటు బిల్లు చూస్తే షాక్ కొట్టేలా ఉంటోందన్నారు. తెలుగుదేశం పార్టీ ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించి, అన్ని వర్గాలను ఆదుకుంటుందన్నారు. మేనిఫెస్టోను ప్రతి కార్యకర్త ఇంటింటికీ తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ గోపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వల్లెపు సోమశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి టైలర్ రమణ, నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి టైలర్ రామాంజులు, వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు కిష్టప్ప, నాయకులు భాస్కరరెడ్డి, అంగడి అమరనాథ్, తుమ్మిలిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, ఆవుల వెంకటేష్, మారుతి పాల్గొన్నారు.
Updated Date - 2023-06-14T00:13:39+05:30 IST