సజావుగా పది పరీక్షలు
ABN, First Publish Date - 2023-04-03T23:57:21+05:30
పదో తరగతి పరీక్షలు సోమవారం మొదటిరోజు జిల్లావ్యాప్తంగా సజావుగా జరిగాయి. ఉదయం 8.45 గంటల కే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.
పలు పరీక్షా కేంద్రాల్లో వసతుల కొరత
లైట్లు, ఫ్యాన్లు లేక విద్యార్థుల ఇబ్బందులు
హిందూపురం అర్బన, ఏప్రిల్ 3: పదో తరగతి పరీక్షలు సోమవారం మొదటిరోజు జిల్లావ్యాప్తంగా సజావుగా జరిగాయి. ఉదయం 8.45 గంటల కే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. హిందూపురంలో 13 పరీక్షా కేంద్రాలు కేటాయించారు. 1808 మంది విద్యార్థులకు గాను 1786 మంది హాజరయ్యారు. 22 మంది గైర్హాజరైనట్లు ఎంఈఓ గంగప్ప తెలిపా రు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వచ్చి సౌకర్యాలు పరిశీలించారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు లేకపోవడంతో విద్యార్థులు కాస్త ఇబ్బంది పడ్డారు. హిందీ పరీక్షకు అన్ని సదుపాయాలు కలగజేస్తామని ఆయా పాఠశాలల యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. హిం దూపురంలో సిట్టింగ్ స్క్వాడ్ నాగరాజు 7 కేంద్రాలను తనిఖీ చేశారు.
ఆఖరి నిమిషంలో విద్యార్థుల పరుగులు
హిందూపురం ఎంజీఎం పాఠశాలలో ఓ విద్యార్థిని 9.30 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకుంది. దీంతో పాఠశాల యాజమాన్యం అనుమతిస్తుందో లేదో అని భయాందోళన చెందింది. అయితే మొదటి రోజు కావడంతో అనుమతిస్తామని, మరలా ఇలా జరిగితే అనుమతి ఉండదని సంబంధిత అ ధికారులు తెలిపినట్లు సమాచారం.
పట్టుదలతో పరీక్షకు..
పదో తరగతి పరీక్షలు అంటేనే విద్యార్థుల్లో ఒత్తిడి ఉంటుంది. అందులో నూ ప్రమాదానికి గురైన విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా ఉం టుంది. హిందూపురం పరిధిలోని ముద్దిరెడ్డిపల్లి జిల్లాపరిషత పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ముకేష్ గత నెల 26న ద్విచక్రవాహన ప్రమాదంలో గాయపడ్డాడు. తల, మొహానికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం పరీక్ష లు ప్రారంభం కావడంతో గాయాలతోనే విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. అ యితే పరీక్ష రాయడానికి కూడా వీలు కాలేదు. దీంతో తల్లిదండ్రులు డీఈఓ మీనాక్షిని కలిసి, మెడికల్ రిపోర్టులు చూపించారు. స్ర్కైబ్‌కు అనుమతి ఇ చ్చారు. బాధిత విద్యార్థికి పట్టణంలోని నేతాజీ మున్సిపల్ పాఠశాల పరీక్షా కేంద్రంగా పడింది. ముద్దిరెడ్డిపల్లి నుంచి తండ్రి సాయంతో కేంద్రానికి వ చ్చాడు. పాఠశాల హెచఎం చంద్రశేఖర్, బాధిత విద్యార్థికి నేతాజీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాయి ప్రసన్న సాయంతో పరీక్ష రాయించేలా ఏర్పాటు చేశారు.
పెనుకొండ: పట్టణంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో సోమవారం ప్ర శాంతంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రంలో 185 మంది హాజరు కావాల్సి ఉండగా, నలుగు రు గైర్హాజరయ్యారు. బాలికల ఉన్నత పాఠశాలలో 216కు గాను ఇద్దరు, శాంతినికేతన పరీక్షాకేంద్రంలో 260 మందికి గాను ముగ్గురు గైర్హాజరయ్యా రు. పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్‌లుగా చంద్రశేఖర్, రంగప్ప, జ్యోతిర్మయి, డిపార్ట్‌మెంటల్ అధికారులుగా ఇందిరాదేవి, శ్రీలత వ్యవహరిం చారు. మధుసూదన ఆధ్వర్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ తహసీల్దార్ స్వర్ణలత, ఎస్‌ఐ రమే్‌షబాబు పరిశీలించారు. మొదటి రోజు తెలుగు పరీక్షకు ఉద యం 8 గంటలకే విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలు, వాటర్‌క్యానలు ఏర్పాటు చేశారు.
రొద్దం: స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల ఏ,బీ సెంటర్లు, ఆర్ మరువపల్లి కస్తూర్బా పాఠశాల సీ సెంటర్‌లో పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. ఏ సెంటర్‌లో 209 మందికి గాను 205 మంది హాజరుకాగా న లుగురు గైర్హాజరయ్యారు. బీ సెంటర్‌లో 162కు గాను 161 మంది హాజరుకాగా ఒకరు గైర్హాజరయ్యారు. సీ సెంటర్‌లో 180 మందికి గాను 178 మం ది హాజరై, ఇద్దరు గైర్హాజరయ్యారు. బీ సెంటర్‌లో విద్యార్థిని సర్వితకు కాళ్లు చేతులు చొచ్చుపడటంతో వైద్యాధికారి సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో 9వ తరగతి విద్యార్థితో స్రైబ్ కింద పరీక్ష రాయించారు. తహసీల్దార్ అనంతచారి, ఎంపీడీఓ రాబర్ట్‌విల్సను పరీక్షా కేంద్రం తనిఖీ చేశారు. ఎస్‌ఐ నాగస్వామి పరీక్షల బందోబస్తు పర్యవేక్షించారు.
పరిగి: మండలవ్యాప్తంగా నాలుగు పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్ష లు సజావుగా ప్రారంభమయ్యాయి. పరిగి జడ్పీహెచఎ్‌స పాఠశాలలో 209 మందికి గాను 205 మంది, సేవామందిరం జడ్పీహెచ ఎస్‌లో 180 మందికి గాను 179 మంది, కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎ్‌సలో 151 మందికిగాను 150 మంది, అమర్ విద్యామందిరంలో 147 మందికి గాను 146 మంది హాజరయ్యారు. మండల వ్యాప్తంగా 687మందికి గాను ఏడుగురు విద్యార్థులు గై ర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.
గోరంట్ల: పట్టణంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు ఎంఈఓ గోపాల్‌నాయక్ తెలిపారు. మండలంలోని 11 ప్రభుత్వ, 8 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 1250 మంది విద్యార్థులు తెలుగు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 1233 మంది హాజరయ్యారు. 17 మంది గైర్హాజరయ్యారు. బాలుర ఉన్నత పాఠశాలలో 186మందికి గాను 183 మంది, శ్రీ చైతన్యలో 246 మందికి గాను 241 మంది, బాలికల ఉన్నత పాఠశాలలో 187 మందికి గాను 183 మంది, న్యూమాంటిస్సొరిలో 181 మందికి గాను 180 మంది, శ్రీవివేకానందలో 180 మందికి గాను 178 మంది, ఉర్దూ ఉన్నత పాఠశాలలో 100 మందికి గాను వంద శాతం, ఉదయ్‌కిరణ్‌లో 170 మందికి 168 మంది పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలను డీవైఈఓ రంగస్వామి, తహసీల్దార్ రంగనాయకులు, ఎంఈఓ గోపాల్‌నాయక్ పరిశీలించారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ బాబు, పోలీస్ సిబ్బందితో పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
సోమందేపల్లి: స్థానిక ఉన్నత పాఠశాల, క్రీ.జ్యోతి విజ్ఞాన పాఠశాలలో పదో తరగతి పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 580 మంది వి ద్యార్థులు పరీక్షలు రాశారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎంఈఓ ఆంజనేయులునాయక్ చర్యలు చేపట్టారు. స్క్వాడ్ సిబ్బంది తనిఖీ చేశారు.
మడకశిరటౌన: పట్టణంలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో 1106 మంది విద్యార్థులకు గాను 15 మంది గైర్హాజరైనట్లు ఎంఈఓ భాస్క ర్ తెలిపారు. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొన్నారు. మొదటి రోజు కావడంతో గదులను వెతుక్కొనేందుకు కాస్త ఇ బ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 177 మందికి గా ను 177 మంది, బాలికోన్నత పాఠశాలలో 170 మందికి గాను 168 మంది, మాతా ఇంగ్లీ్‌షమీడియం పాఠశాలలో 169 మందికిగాను 166 మంది, సరస్వతీ విద్యా మందిరంలో 178 మందికి గాను వంద శాతం, సిద్ధార్థ విద్యానికేతన పాఠశాలలో 175 మందికిగాను 173 మంది, సెయింట్‌ఆన్స ఏ సెంటర్‌లో 250 మందికిగాను 244 మంది, బీ సెంటర్‌లో 144 మందికి గాను 142 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు.
రొళ్ల: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రంలో పదో విద్యార్థులు 223 మందికిగాను వందశాతం పరీక్షకు హాజరయ్యారు. కేజీబీవీ పాఠశాలలో 232 మందికిగాను ఒకరు గైర్హాజరైనట్టు పరీక్ష నిర్వాహకులు రవీంద్రరెడ్డి, శకుంతలమ్మ తెలిపారు. పరీక్షా కేంద్రాలను తహసీల్దార్, ఎస్‌ఐ వెంకటరమణ తనిఖీ చేశారు.
అగళి: మండలకేంద్రంలోని కస్తూర్బా పాఠశాల పదోతరగతి పరీక్షా కేంద్రంలో 124 మంది విద్యార్థులకు 122 మంది హాజరయ్యారు. ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈఓ గోపాల్ తెలిపారు. తెలిపారు. జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 199 మంది విద్యార్థులకు 199 మంది హాజరయ్యారు. ఎస్‌ఐ డీ లావణ్య పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన అమలు చేశారు. వైద్య సదుపాయం, తాగునీరు ఏర్పాటు చేశారు. డిపార్ట్‌మెంటల్ అధికారిగా లక్ష్మీపతి, స్పెషల్ ఆఫీసర్‌గా యంజారప్ప, చీఫ్ సూపరింటెండెంట్‌గా లక్ష్మయ్య పరీక్షలను పర్యవేక్షించారు.
గుడిబండ: స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, కరికెర కేజీబీవీ పాఠశాలలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు చీఫ్‌లు రవిచంద్రకుమార్, సునీత తెలిపారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Updated Date - 2023-04-03T23:57:21+05:30 IST