చంద్రబాబు పాలనలోనే రాష్ట్రాభివృద్ధి
ABN, First Publish Date - 2023-04-20T23:23:29+05:30
The development of the state was under Chటీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, వైసీపీ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని మండల టీడీపీ నాయకులు విమర్శించారు. andrababu's rule
రొద్దం, ఏప్రిల్ 20: టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, వైసీపీ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని మండల టీడీపీ నాయకులు విమర్శించారు. మండలంలోని ఎం కొత్తపల్లిలో గురువారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు, కార్యక ర్తలు ఇంటింటికీ వెళ్లి, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి పనులే గ్రామాల్లో ఇప్పటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తున్నాయన్నారు. అభివృద్ధి అంటే చంద్రబాబు అని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు చేరువ చేశార ని గుర్తు చేశారు. భవిష్యత్తులో చంద్రబాబును ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, ఈరన్న, క్లస్టర్ ఇనచార్జి నాగేంద్ర, చిన్న సుబ్బరాయుడు, పెద్ద వీరన్న, అంజినప్ప, శ్రీనివాసులు, నాగన్న, లక్ష్మణ్ణ, నంజప్ప, వెంకటరాముడు, ముత్యాలప్ప, రామాంజప్ప, శంకరప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-20T23:23:29+05:30 IST