ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలకువణుకు

ABN, First Publish Date - 2023-02-18T00:46:14+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనపర్తి పర్యటనను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు అనపర్తి పర్యటనతో తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలకు వణుకు పుడుతోందని అన్నారు.

అనంతపురంలో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందుకే చంద్రబాబు పర్యటన అడ్డగింత

టీడీపీ నాయకుల ఫైర్‌.. జిల్లా వ్యాప్తంగా నిరసన

అనంతపురం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనపర్తి పర్యటనను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు అనపర్తి పర్యటనతో తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలకు వణుకు పుడుతోందని అన్నారు. అనంతపురం రెండో డివిజనలో ముఖానికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో సెల్‌ఫోన్ల లైట్ల వెలుగులో నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుర్మార్గ ప్రభుత్వం: కేశవ్‌

గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటనకు వస్తున్న జనాన్ని చూసి తాడేపల్లి ప్యాలె్‌సలోని పెద్దలకు వెన్నులో వణుకు పుడుతోందని పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌ అన్నారు. చంద్రబాబును అడ్డుకోవడం దారుణమని, ఇదో దుర్మార్గపు ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాయకులకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని అన్నారు. చంద్రబాబు తన పర్యటనను ఉదయం మొదలుపెట్టినప్పటి నుంచి రాత్రి ముగించే వరకూ రోడ్డు పొడవునా జనం ఆయనకు స్వాగతం పలుకుతున్నారని, సభలకు పెద్ద ఎత్తున వస్తున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం అనపర్తి పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చి, ఇప్పుడు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబును పోలీసు వాహనాలను అడ్డుపెట్టి అడ్డుకోవాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. చంద్రబాబు నడుచుకుంటూ అనపర్తికి వెళుతుంటే.. దారి పొడవునా లైట్లను ఆర్పేశారని, జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడికిచ్చే గౌరవం ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనపర్తిలో సభా వేదిక వద్ద ఉన్న జనరేటర్లను ఎత్తుకెళ్లడం తగునా అని నిలదీశారు. వీటన్నింటిని చూస్తుంటే... మనం రాతియుగంలో ఉన్నామా అని అనుమానం కలుగుతోందని అన్నారు. ప్రజలంటే భయపడి పరదాల చాటున తిరిగే మీకు ప్రజల మధ్యన రోడ్‌షోలు పెట్టే దమ్మెక్కడదని సీఎంను నిలదీశారు. చేతగాక, చేవలేక చంద్రబాబు, లోకేష్‌ సమావేశాలను అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎంత ఉపయోగించినా సరే తెలుగుదేశం ప్రభంజనాన్ని ఆపలేరని అన్నారు. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని భారతదేశంలో ఎన్నడూ చూసి ఉండరని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌ పర్యటనలు ఆగవు.. ముందుకు సాగుతాయని అన్నారు.

పిరికిపంద చర్య: గౌస్‌

చంద్రబాబునాయుడును అనపర్తి సభకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌ మొద్దీన అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి గడ్డురోజులు దగ్గరపడుతున్నాయని, అందుకే చంద్రబాబు పర్యటనలకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తోందని అన్నారు. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన పాలన సాగిస్తున్నాడనేందుకు తమ నాయకుడిని అడ్డుకోవడమే నిదర్శనమని అన్నారు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. వైసీపీ పెద్దలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా చంద్రబాబు, లోకేష్‌ సభలను అడ్డుకోలేరని, ప్రజలు చంద్రబాబు, లోకే్‌షకు రక్షణగా నిలుస్తారని అన్నారు.

టీడీపీ శ్రేణుల నిరసన

అనంతపురం అర్బన: చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని టీడీపీ నాయకులు మండిపడ్డారు. రెండో డివిజనలో నల్ల బ్యాడ్జీలు ధరించి టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. కార్యక్రమంలో నాయకులు దేవళ్ల మురళి, డిష్‌ నాగరాజు, సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌, మారుతీకుమార్‌ గౌడ్‌, కూచి హరి, గోపాల్‌ గౌడ్‌, గుర్రం నాగభూషణం, కుంచెపు వెంకటేష్‌, మార్కెట్‌ మహేష్‌, కంఠాదేవి తదితరులు పాల్గొన్నారు.

దుర్మార్గపు ప్రభుత్వం: ఆదెన్న

రాష్ట్రంలో దుర్మార్గపు ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర నాయకుడు ఆదెన్న మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకొని తమ నాయకుడు చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయం లో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రా ష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.

అడ్డుకోవడం హేయం

మాజీ సీఎం చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం హేయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుగ్గయ్య చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మినరసింహులు, బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు సిమెంట్‌ పోలన్న మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నారని అన్నారు.

పౌర హక్కులను కాలరాస్తున్నారు

కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇనచార్జి ఉమా

కంబదూరు (కళ్యాణదుర్గం రూరల్‌): పౌరహక్కులను పోలీసులే కాలరాస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు విమర్శించారు. అనపర్తి సభకు అనుమతి లేదని బలభద్రపురం వద్ద చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారని ఆయన అన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ శుక్రవారం రాత్రి కళ్యాణదుర్గంలో పార్టీ నాయకులతో కలిసి నిరసనకు దిగారు. అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట కళ్లకు నల్లబ్యాడ్జీలు ధరించి, అర్ధనగ్నంగా బైఠాయించారు. సెల్‌ఫోన లైట్లు వేసుకుని వైసీపీ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేదా అని పోలీసులను ఉమా ప్రశ్నించారు. ఉద్రిక్తత నడుమ ఉమాను పట్టణ పోలీ్‌సస్టేషనకు తరలించారు. అనంతరం అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు స్టేషన ముందు బైఠాయించారు. తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాసేపటి తర్వాత ఉమాను సొంత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు.

Updated Date - 2023-02-18T00:46:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising