ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీల విద్యుత బకాయిలు రూ.94 కోట్లు

ABN, First Publish Date - 2023-04-21T23:38:11+05:30

వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి పం చాయతీలకు నయాపైసా విదల్చలేదు. గ్రామాల్లో అభివృద్ధి మందగిం చింది. మరోవైపు రొద్దం, పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో తాగునీటి సౌకర్య, వీధిలైట్ల విద్యుత బకాయిలు రూ.94 కోట్లు ట్రాన్సకోకు చె ల్లించాల్సి ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం, ఏప్రిల్‌ 21: వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి పం చాయతీలకు నయాపైసా విదల్చలేదు. గ్రామాల్లో అభివృద్ధి మందగిం చింది. మరోవైపు రొద్దం, పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో తాగునీటి సౌకర్య, వీధిలైట్ల విద్యుత బకాయిలు రూ.94 కోట్లు ట్రాన్సకోకు చె ల్లించాల్సి ఉంది. నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పంచాయతీల ఖాతాల కు నయాపైసా విడుదల చేయలేదు. గ్రామాల్లో విద్యుత బకాయిలు తడిసి మోపెడయ్యాయి. పలుమార్లు విద్యుత బిల్లుల కోసం పంచాయ తీ ఖాతాలకు నిధులు మళ్లించి, ఆవెంటనే విద్యుత బకాయిలకు జమచేసుకుంది. దీంతో సర్పంచులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల్లో సర్పంచులు వీధిలైట్లు కొనుగోలు చేయకుండా జీఓ తీసుకొచ్చారు. దీం తో పంచాయతీ సర్పంచులు, వీధిలైట్లు మరమ్మతు చేయించక, కొత్తలై ట్లు ఏర్పాటు లేకపోవడంతో అనేక గ్రామాల్లో అంధకారం నెలకొంది. గ్రామ పంచాయతీ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వమే మళ్లించుకుంటోంది. ఈపరిస్థితుల్లో సర్పంచులు దిక్కుతోచ ని స్థితిలో పడ్డారు.

బకాయిల భారం

పెనుకొండ విద్యుతశాఖ ఏడీ కార్యాలయ పరిధిలోని మూడు మండలాలకు కలిసి రూ.94 కోట్ల విద్యుత బకాయిలు ట్రాన్సకోకు పంచాయతీల నుంచి చెల్లించాల్సి ఉంది. ఒక్క పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.33,46,38,903 చెల్లించాల్సి ఉంది. పెనుకొండ మండల వ్యాప్తంగా రూ.46,62,73,562లు చెల్లించాల్సి ఉంది. రొద్దం మేజర్‌ పంచాయతీలో రూ.6,97,90,075 చెల్లించాల్సి ఉండగా, మండలవ్యాప్తంగా ఉన్న 19 పం చాయతీలకు రూ.16,33,87,140 చెల్లించాల్సి ఉంది. సోమందేపల్లి మేజర్‌ పంచాయతీ రూ.13,52,04,404 బకాయి ఉండగా, మండలవ్యాప్తంగా ఉన్న పంచాయతీలకు రూ25,16,82,914 చెల్లించాల్సి ఉంది. మూడు మండలాలకు కలిపి నాలుగేళ్లుగా బకాయిలు రూ.88,13,43,616 చెల్లించాల్సి ఉంది. దీనికితోడు పాత బకాయిలు రూ.5,89,90,449లతో కలిపి రూ.94,03,24,665 ప్రభుత్వం పంచాయతీల నుంచి ట్రాన్సకోకు చెల్లించాల్సి ఉంది.

పంచాయతీలకు నిధులేవీ?

గ్రామ పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభు త్వం ఇవ్వక మొండిచేయి చూపింది. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం, తా గునీటి సౌకర్యం అస్తవ్యస్తంగా తయారైంది. సర్పంచుల ఖాతాలో చిల్లిగవ్వలేదు. పలువురు సర్పంచులు సొంత ఆస్తులు అమ్మి అప్పులు తీ ర్చుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు సర్పంచులుగా ఎన్నికయ్యామని నిట్టూర్చుతున్నారు. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, భూములు తా కట్టుపెట్టి పంచాయతీల్లో పనిచేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో అప్పులు తీర్చారన్న విమర్శలున్నాయి.

ప్రతినెలా నోటీసులు

ట్రాన్సకో కార్యాలయాల నుంచి బకాయిపడ్డ బిల్లులు చెల్లించాలని ప్రతినెలా నోటీసులు పంపుతున్నట్లు పెనుకొండ విద్యుతశాఖ ఏడీ కరుణాకర్‌ తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో పంచాయతీలు ట్రాన్సకోకు బ కాయి పడ్డారు. ఆ శాఖ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మెరుగైన విద్యుత సేవలు అందించేందుకు బకాయిలు వెంటనే చెల్లిస్తే సంస్థకు కష్టాలు తప్పుతాయన్నారు.

నాలుగేళ్ల విద్యుత బకాయిలు ఇలా..

పెనుకొండ మునిసిపాలిటీ తాగునీటి బకాయిలు రూ.16,09,22,833, వీధిలైట్ల బకాయిలు రూ.17,37,16,070 - మొత్తం రూ.33,46,38,903

పెనుకొండ మండలం తాగునీరు రూ.22,28,54,023, వీధిలైట్లు రూ.24,34,19,539 - మొత్తం రూ.46,62,73,562

రొద్దం మేజర్‌ పంచాయతీ తాగునీరు రూ.3,23,66,756, వీధిలైట్లు రూ.3,74,23,319 - మొత్తం రూ.6,97,90,075

రొద్దం మండలం తాగునీరు రూ.7,46,24,920, వీధిలైట్లు రూ.8,87,62,220 - మొత్తం రూ.16,33,87,140

సోమందేపల్లి మేజర్‌పంచాయతీ తాగునీరు రూ.6,38,87,258, వీఽధిలైట్లు రూ.7,13,17,146- మొత్తం రూ.13,52,04,404

సోమందేపల్లి మండలం రూ.11,71,42,862 వీధిలైట్లు రూ.13,45,40,052 - మొత్తం రూ.25,16,82,914, పాత బకాయిలు రూ.1,47,70,017, రూ.5,75,13,432 - మొత్తం రూ.5,89,90,449.

మూడు మండలాలకు సంబంధించి మొత్తం బకాయిలు రూ.41,46,21,865. రూ.46,67,21,811 - మొత్తం రూ.88,13,43,616.

భూములు అమ్మాల్సి వస్తోంది?

- మంజునాథ్‌, సర్పంచు, బీదానిపల్లి

గ్రామ పంచాయతీలకు నిధులు రాక సర్పంచులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. మోటార్లు, స్టార్టర్లు మరమ్మతు లకు వస్తే ఏవిధంగా చేయించాలో దిక్కుతోచ డం లేదు. అప్పులు తీర్చేందుకు భూములు అ మ్మేందుకు సిద్ధంగా ఉన్నాం.

భూమి తాకట్టు పెట్టా..

- మహాలక్ష్మి, తాడంగిపల్లి

సర్పంచు అంటే ఎంతో గౌరవం ఉండేది. ప్ర భుత్వ వైఫల్యం వల్ల అడుక్కుతినే పరిస్థితి వ చ్చింది. భూమిని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి అప్పులు కట్టాం. సర్పంచుల ఖాతాల్లోకి ని ధులు ఎప్పుడు పడతాయని కళ్లకు కాయలు కా సేలా ఎదురుచూస్తున్నాం. ముఖ్యమంత్రి అయి నా స్పందించి, సర్పంచులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం.

Updated Date - 2023-04-21T23:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising