ఉద్యోగ సమస్యలపై పోరాటం ఆగదు
ABN, First Publish Date - 2023-05-29T23:31:54+05:30
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం ఆగదని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గోవిందప్ప డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘం నాయకుల రిలే నిరాహార దీక్ష
మడకశిరటౌన, మే 29: ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం ఆగదని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గోవిందప్ప డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా నాయకు లు మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయ ణ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్‌లను పరిష్కరించాలని కోరారు. సీపీఎస్ విధానం రద్దు, ప్రతి నెలా ఒకటిన జీతభత్యాలు చెల్లించాలని, 11వ పీఆర్‌సీ అమలులో ఆర్థిక పరమైన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్‌లు ప రిష్కరించని పక్షంలో విడతల వారిగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి, స మస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న, తాలూకా అధ్యక్షుడు మ హలింగప్ప, ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి బాబాఫకృద్దీన, ఎస్‌టీ యూ జిల్లా కార్యదర్శి ఆదినారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-29T23:31:54+05:30 IST