ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే సొంత ఇంటికి రోడ్డు...

ABN, First Publish Date - 2023-04-30T23:51:02+05:30

నియోజకవర్గంలో రహదారులు గుంతలమయంగా మారినా... ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి తన సొం త ఇంటికి మాత్రం రోడ్డు వేయించుకొన్నారని టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మంజునాథ్‌ సెల్ఫీ చాలెంజ్‌ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్లె రోడ్ల గుంతలూ పూడ్చలేని దయనీయం!

టీడీపీ నాయకుల సెల్ఫీ చాలెంజ్‌

మడకశిరటౌన, ఏప్రిల్‌ 30: నియోజకవర్గంలో రహదారులు గుంతలమయంగా మారినా... ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి తన సొం త ఇంటికి మాత్రం రోడ్డు వేయించుకొన్నారని టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మంజునాథ్‌ సెల్ఫీ చాలెంజ్‌ విసిరారు. ఆదివారం సెల్ఫీ ద్వా రా ఎమ్మెల్యే ఇంటి వద్ద వేయించుకొన్న సీసీ రోడ్డుతో పాటు నియోజకవర్గంలో పలుచోట్ల గుంతలుగా మారిన రహదారుల ఫొటోలను సెల్ఫీ తీశారు. ఈసందర్భంగా మంజునాథ్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంటే... ఎమ్మెల్యే తన సొంత ఇంటి వద్దకు మాత్రం సీసీ రోడ్డు వేయించుకోవడం ఎంతవరకు న్యాయమంటూ ప్ర శ్నించారు. రాష్ట్రంలో నిధులు ఖర్చు పెట్టడంలో మడకశిర నియోజకవ ర్గం చిట్టచివరి స్థానంలో నిలిచిందన్నారు. ప్రజలకు ఒక న్యాయం, ప్ర జాప్రతినిధికి మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ని యోజకవర్గంలో రోడ్లను బాగు చేయించాలని కోరారు.

టీడీపీ హయాంలోనే అభివృద్ధి...

రొద్దం: తురకలాపట్నం గ్రామంలో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని టీడీపీ నాయకులు వైసీపీ వారికి సెల్ఫీ చాలెంజ్‌ విసిరారు. ఎస్సీ కాలనీ కోసం రూ.2 కోట్లతో సీసీరోడ్డుచేపట్టారని అన్నారు. తురకలాపట్నం చెరువుకు కృష్ణాజలాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జిల్లాపరిషత చైర్మనగా పనిచేసిన కాలంలో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి జిల్లాపరిషత హైస్కూల్‌ను తీసుకొచ్చారన్నారు. గ్రామంలో ప్రతి వీధికీ సీసీరోడ్లను నిర్మించారన్నా రు. వైసీపీ హయాంలో మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని స్థానికులు విమర్శించారు. టీడీపీ హయాంలో చేసిన పనులు సాక్షాలుగా కనిపిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు హరిక్రి ష్ణ, షణ్ముఖ శ్రీనివాసులు, నాగభూషణ, చక్రి పాల్గొన్నారు.

Updated Date - 2023-04-30T23:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising