చెరువు పనులను పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ బృందం
ABN, First Publish Date - 2023-04-26T00:03:37+05:30
గోరంట్ల పెద్దచెరువు మరమ్మతు పనులను ఏ డుగురు సభ్యుల ప్రపంచ బ్యాంక్ అధికార బృందం మంగళవారం ప రిశీలించింది.
గోరంట్ల, ఏప్రిల్ 25: స్థానిక పెద్దచెరువు మరమ్మతు పనులను ఏ డుగురు సభ్యుల ప్రపంచ బ్యాంక్ అధికార బృందం మంగళవారం ప రిశీలించింది. సమీకృతసాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం దా రా రూ.84 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. బృందం అధికారు లు వెంకట, శ్యాంతను, సుధీరేందర్, సౌమ్య, రంజన, నోరా, షాగన సంబంధిత పనులు పరిశీలించారు. ఇప్పటివరకు రూ.53 లక్షలతో చె రువుకట్ట అభివృద్ధి, రెండు మరువల మరమ్మతులు చేపట్టారు. చెరువు ఆయకట్టు 222 ఎకరాలుందనీ, అయితే నీరున్నా సాగు విస్తీర్ణం తక్కువగా ఉండటంతో సభ్యులు ఆరాతీశారు. దశాబ్దాల కాలంగా ఆయకట్టు సాగులేక ముళ్ల పొదలు దట్టంగా ఏర్పడ్డాయని రైతులు తెలిపారు. దీనికితోడు చెరువు మరమ్మతు పనులు నిలిచిపోయినట్లు ఇరిగేషన అ ధికారులు వివరించారు. రూ.14 లక్షలతో సప్లయ్ చానల్ పనులు చేపట్టిన కారణంగా రైతులు పంట సాగుచేయక, సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. 960 మీటర్ల చెరువుకట్టపై 300 మీటర్ల అభివృద్ధి పనులు జరగాల, రెండు మరువల పనులు అర్ధంతరంగా ఆగడాన్ని గుర్తించారు. ప్రజల సౌకర్యార్థం మరువ నీటిపై కల్వర్టు నిర్మాణానికి రూ.60లక్షల నిధులు అదనంగా కావాలని ఇరిగేషన అధికారులు వివరించారు. అ నంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాఘవ య్య, ఇరిగేషన ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి, గంగాధర్, నారాయణనాయ క్, డీఈఈ యోగానంద, ఏఈలు రవీంద్ర, సుధాకర్‌రాజు, క్వాలిటీ కంట్రోల్ ఈఈ రాజేంద్రప్రసాద్ డీఈ రవీంద్రనాథ్, ఏఈ జీవన అగ్రికల్చర్ ఏడీ అల్తాఫ్ అలీఖాన, ఏఓ మహబూబ్‌బాషా పాల్గొన్నారు.
Updated Date - 2023-04-26T00:03:37+05:30 IST