అవ్వాతాతలకు జగనన్న అన్యాయం
ABN, First Publish Date - 2023-01-01T00:38:10+05:30
ముఖ్యమంత్రి వైఎస్ జగనరెడ్డి నవరత్నాల పేరుతో అందరికి సంక్షే మ పథకాలు అందిస్తామని గొప్పలు చెప్పి... పండుటాకులైన అవ్వాతాతల పింఛన లకు నోటీసు లిచ్చి మోసం చేస్తున్నాడంటూ టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ, మారుతి రెడ్డి మండి పడ్డారు.
టీడీపీ నాయకులు
పుట్టపర్తి, డిసెంబరు 31: ముఖ్యమంత్రి వైఎస్ జగనరెడ్డి నవరత్నాల పేరుతో అందరికి సంక్షే మ పథకాలు అందిస్తామని గొప్పలు చెప్పి... పండుటాకులైన అవ్వాతాతల పింఛన లకు నోటీసు లిచ్చి మోసం చేస్తున్నాడంటూ టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ, మారుతి రెడ్డి మండి పడ్డారు. వారు శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కరెంటుబిల్లు ఎక్కువని, వెయ్యిచదరపు అడుగుల స్థలమంటూ, భూమి ఎక్కువ ఉందంటూ, అధక ఆదా యమంటూ నోటీసులిచ్చి అవ్వాతాతలకు అందోళన కలుగజేస్తున్నా డంటూ విమర్శించారు. వయో వృద్ధుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో జగనరెడ్డి చెప్పాలన్నారు. అనర్హులకు ప్రాధాన్యమిచ్చి అర్హులకు అన్యాయం చేశా రని ఇదేనా జగనన్న ప్రభు త్వంలో సంక్షేమమంటూ విమర్శించారు. పేదలకు రెం డు సెంట్ల స్థలం ఇవ్వలేరు కానీ, పార్టీ కార్యాలయానికి ఏకంగా నామకేవాస్తు అద్దెతో రెండెకరాలు కేటా యించడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. జిల్లాలో 8660 మందికి పింఛన దారులకు నోటీసులిచ్చి తర్వాత 5వేల మందికి అర్హత పొందారని తెపిపారన్నారు. మిగతావారు అర్హతకు సంబంధించి పత్రాలు చూపలేదనే సాకు తో పింఛన తొలగించేందుకు కుట్ర సాగుతోందని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వడ్డేనాగరాజు, వంశీ కిశోర్, సాయికుమార్, కుళ్లాయప్ప తదితరులు కేటాయించాలన్నారు.
Updated Date - 2023-01-01T00:38:14+05:30 IST