ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్దార్‌ కార్యాలయంలో పోస్టులు ఖాళీ

ABN, First Publish Date - 2023-05-29T23:29:20+05:30

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో నెలల తరబడి పోస్టుల భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో ఇనచార్జిల పాలన ప్రజలను విస్తుగొలుపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సకాలంలో ప్రజలకు అందని రెవెన్యూ సేవలు

సోమందేపల్లి, మే 29: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో నెలల తరబడి పోస్టుల భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో ఇనచార్జిల పాలన ప్రజలను విస్తుగొలుపుతోంది. సిబ్బంది లేక ప్రజలు, రైతులు, విద్యార్థు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్‌ మురళీక్రిష్ణను ఇటీవలే పుట్టపర్తికి బదిలీ చేశారు. ఆస్థానంలో ఇనచార్జి తహసీల్దార్‌గా పరిగి తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మీని నియమించారు. ఆ మె రెండుచోట్లా బాధ్యతలు నిర్వహిస్తుండటం వల్ల ప్రజలకు సకాలం లో సేవలందడంలేదు. మరోవైపు కార్యాలయంలో సిబ్బంది కొరత కూ డా పీడిస్తోంది. డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టు ఖాళీ అయి నెలలు గడుస్తున్నా, ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. మండలంలో 16 రెవెన్యూ గ్రా మాలు ఉన్నాయి. ఆయా గ్రామాలకు సంబంధించి వీఆర్‌ఓలను కూ డా అధికారులు పూర్తిస్థాయిలో కేటాయించలేదు. ఇక్కడ నాలుగు వీఆర్‌ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్‌ఓలకు అదనపు గ్రామాలు కేటాయించడంతో వారికి పని ఒత్తిడి అధికమవుతోంది. ముఖ్యంగా సర్వేయర్‌ పోస్టు కూడా ఖాళీగా ఉంది. దీంతో సర్వే పనులు మందకొడిగా సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఆర్‌ఐలతో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు కూడా ఖాళీగా ఉ న్నాయి. కార్యాలయంలో ప్రధానమైన అధికారులు లేకపోవడంతో ప్రజ లు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయానికి వెళ్తే తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదంటున్నారు. ప్రస్తుతం రైతుల రుణాలకు సంబంధించి 1బీ, అడంగల్‌ మంజూరు కావాల్సి ఉంది. పలు గ్రామాలకు సంబంధించి 1బీ, అడంగల్‌కు డిజిటల్‌ సంతకాలు లేకపోవడంతో రైతులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభం కా నుండటంతో విద్యార్థులు కూడా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కో సం కార్యాలయం వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తహసీల్దార్‌తోపాటు ఇతర పోస్టు లు త్వరితగతిన భర్తీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-05-29T23:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising