ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో అభివృద్ధి లేదు.. జగన ఆదాయమే పెరిగింది

ABN, First Publish Date - 2023-06-10T00:03:17+05:30

ఒక్కచాన్స అంటూ అధికారంలోకి వచ్చిన జగన... రాష్ట్రాభివృద్ధిని గాలికివదిలేసి, తన ఆదాయాన్ని పెంచుకున్నారని మాజీ మంత్రి పలె ్లరఘునాథరెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాబు పథకాల్లో సగం కూడా వైసీపీ అమలు చేయలేదు..

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

పుట్టపర్తి, జూన 9: ఒక్కచాన్స అంటూ అధికారంలోకి వచ్చిన జగన... రాష్ట్రాభివృద్ధిని గాలికివదిలేసి, తన ఆదాయాన్ని పెంచుకున్నారని మాజీ మంత్రి పలె ్లరఘునాథరెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పల్లె మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి మాట ఎలాఉన్నా, లక్షల కోట్లు అప్పులపాలైందని, అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో గ్యాస్‌, పెట్రోల్‌, నిత్యావసర వస్తువులతో పాటు అన్నిరకాల ధరలు పెరిగాయన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలలో సగం కూడా జగన అమలు చేయలేదని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి, అన్నక్యాంటీన, చంద్రన్నబీమా, పెళ్లికానుక తదితర సంక్షేమ పథకాలను అటకెక్కించారని తెలిపారు. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో ఏడాదికి మూడు ఉచితగ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 2 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఏడాది రైతుకు రూ.20 వేల లబ్ధి, 18-59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు రూ.1500, అమ్మవందనం రూ.15వేలు వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలన్నారు. టీడీపీలో ఉండటం వల్ల గుర్తింపు ఉందని, తల్లిలాంటి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. కొందరు పార్టీలో ఉంటూ తనను విమర్శించడం సరికాదన్నారు. 2024లో అందరూ కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబును సీఎం చేయడానికి కృషిచేద్దామన్నారు.

Updated Date - 2023-06-10T00:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising