ఒక్క చాన్సతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు : టీడీపీ
ABN, First Publish Date - 2023-05-30T23:46:12+05:30
ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స అంటూ జగన ప్ర జలకు ముద్దులు పెడుతూ, అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత విమర్శించారు.
పెనుకొండ, మే 30: ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స అంటూ జగన ప్ర జలకు ముద్దులు పెడుతూ, అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత విమర్శించారు. మంగళవారం స్థానికంగా ఆమె కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో ఏం ఒరగబెట్టిందని సంబరాలు చేసుకుంటున్నారని నిల దీశారు. ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంద న్నారు. టీడీపీ మహానాడుకు కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాది మంది ప్రజ లు తరలివచ్చారన్నారు. ఈస్పందనను చూసి వైసీపీకి వణుకుపుట్టిందని తెలి పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జాబ్‌క్యాలెండర్‌ను అటకెక్కించి, నాలుగేళ్ల కాలంలో ఒక్క ఉ ద్యోగం కూడా బర్తీ చేయలేదని విమర్శించారు. మహానాడు వేదికలో టీడీపీ మినీ మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. 2024లో తాము అధికారంలోకి వ స్తే అమలు చేయబోయే ఆరు ప్రధాన హామీలను ప్రకటించారన్నారు. పూర్ టు రిచ... పేదలను సంపన్నులు చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తుందని చం ద్రబాబు ప్రకటించారన్నారు. అనంతరం మినీ మేనిఫెస్టో కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు మాధవనాయుడు, వెంకటరమణ, శ్రీరాములు, బీవీ ఆంజనేయులు, వెంకటేశ, నరసింహులు, త్రివేంద్రనాయు డు, సుబ్రహ్మణ్యం, బాబుల్‌రెడ్డి, మహబూబ్‌బాషా, ఉమాశంకర్‌పాల్గొన్నారు.
Updated Date - 2023-05-30T23:46:12+05:30 IST