ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు - ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2023-06-12T00:11:11+05:30

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. కొత్తచెరువు ప్రమాదంలో రమణమ్మ(38), బత్తలపల్లి మండలం పోట్లమర్రి ప్రమాదంలో రామకృష్ణ(46), అదే మండలంలోని వెంకటగారిపల్లి సమీపంలో జరిగిన ప్రమాదంలో రిజప్ప(50) మృతిచెందారు. వివరాలివి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

తల్లి మృతి - తండ్రి, కూతురుకు గాయాలు

చెక్క భజనకు వెళ్లి వస్తుండగా ఘటన

కొత్తచెరువు, జూన 11: మండలకేంద్రం సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ప్రమాదంలో తల్లి మృతి చెందగా, తండ్రీకూతురు గాయపడ్డారు. కుటుంబికులు చెక్కభజనకు వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. ఎస్‌ఐ లింగన్న తెలిపిన వివరాలివి. కొత్తచెరువు గ్రామానికి చెందిన కురుబ సూరి, రమణమ్మ(38) దంపతులు కుమార్తె సాయితో కలిసి ద్విచక్రవాహనంలో బంధువుల ఊరు వేములేటిపల్లికి వెళ్లారు. గ్రామంలో చెక్క భనజ కార్యక్రమాన్ని ముగించుకుని, తిరిగి కొత్తచెరువుకు ద్విచ్రవాహనంలో ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో కొత్తచెరువు సమీపంలోని శ్రీరామ కల్యాణ మండపం వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. ధర్మవరం వైపు నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన రమణమ్మ కారు బంపర్‌కు తగులుకోవడంతో దాదాపు 30 అడుగుల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఆమెపై కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త సూరి, కుమార్తె సాయి గాయపడగా, ప్రైవేటు వాహనంలో పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఇసుక టిప్పర్‌

- ఒకరు మృతి

బత్తలపల్లి, జూన 11: మండలంలోని పోట్లమర్రి సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని ఇసుక టిప్పర్‌ ఢీకొంది. ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రామకృష్ణ(46) మృతి చెందాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలివి. రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తోట వద్దకు వెళ్లి ద్విచక్రవాహనంలో తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్‌ ఢీకొంది. ప్రమాదంలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనతో కుటుంబసభ్యులు, బంఽధువులు బోరున విలపించారు. కురుబ కార్పొరేషన చైర్మన కోటి సూర్యప్రకాశబాబు బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.

ద్విచక్రవాహనం బోల్తాపడి మరొకరు...

బత్తలపల్లి మండలం వెంకటగారిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్రవాహనం బోల్తాపడింది. ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గిరిజప్ప(50) మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. గిరిజప్ప పని నిమిత్తం బత్తలపల్లికి వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా, మార్గమధ్యంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో గిరిజప్ప తీవ్రంగా గాయపడగా,స్థానికులు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-06-12T00:11:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising