ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా వాసవీమాత జయంతి

ABN, First Publish Date - 2023-04-30T23:52:54+05:30

ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జయంతి వేడుకలు ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనం గా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం అర్బన, ఏప్రిల్‌ 30: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జయంతి వేడుకలు ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనం గా నిర్వహించారు. హిందూపురంలోని వాసవీ ఆలయం, డీబీ కాలనీ అష్టల క్ష్మీ ఆలయాల్లో వేడుకలు సంబరంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా వారం రోజులుగా సాంస్కృతిక ప్రదర్శనలు, భజనలు, పారాయణం కార్యక్రమాలు చే పట్టారు. ఉదయం అమ్మవారిని ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంక రించి, పూజలు చేశారు. ఉదయం పట్టణంలో బైక్‌ర్యాలీ, అమ్మవారి ఉత్సవ వి గ్రహాన్ని పూల పల్లకిలో అధిష్ఠింపజేసి నగరోత్సవం నిర్వహించారు. ఊరేగిం పులో సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

పెనుకొండ: పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, భజనమండలి ఆధ్వర్యంలో వాసవీమాత చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగిస్తూ నగర సంకీర్తన చేశారు. ఆలయంలో అమ్మవారికి అర్చనలు, పూజలు చేసి, వివిధ పూలతో అలంకరించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాన్ని విద్యుద్దీపాలంకరణతో ముస్తాబైన ర థంలో అధిష్ఠింపజేశారు. కళాకారుల విన్యాసాలు, బ్యాండు మేళాలు, మంగళవాయిద్యాల నడుమ, జ్యోతులతో పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు.

సోమందేపల్లి: స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారికి ఉదయం నుంచి వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. మూలవిరాట్‌కు విశేష అలంకరణ, సాయంత్రం ఉత్సవ విగ్రహాన్ని గ్రామం లో వైభవంగా ఊరేగించారు.

అగళి: స్థానిక వాసవీ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజ లు చేశారు. ఆర్యవైశ్య మహిళలు హారతులు మోసి మొక్కులు తీర్చుకున్నా రు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని మంగళ వాయిద్యాలతో పురవీధుల్లో ఊరే గించారు. భక్తులకు అన్నదానం చేశారు.

మడకశిరటౌన: పట్టణంలోని గాంధీ బజార్‌ వాసవీ ఆలయంలో అమ్మవారికి ఉత్సవ పూజలు నిర్వహించారు. విశేష అర్చనలు, అభిషేకాలు, కుంకుమార్చన పూజలుచేశారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయం నుంచి క న్యకాపరమేశ్వరీ ఆలయం వరకు కలశాలు, హారతులను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.

గుడిబండ: స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీమాత చిత్రపటాన్ని పూలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అ మ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు.

గోరంట్ల: పట్టణంలోని వాసవీ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అ లంకరించారు. క్షీరాభిషేకం, మంగళహారతి పూజలు చేశారు. ఆర్యవైశ్యుల ఆ ధ్వర్యంలో రాత్రి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు.

Updated Date - 2023-04-30T23:52:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising