ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నాణ్యత డొల్ల..!

ABN, First Publish Date - 2023-06-21T00:25:52+05:30

సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీలో నాణ్యతకు తిలోదకాలిచ్చారన్న విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఖరీఫ్‌ సీజనలో రైతులకు సబ్సిడీపై అందజేస్తున్న వేరుశనగ నాణ్యత డొల్లతనం బయటపడింది.

వేరుశనగ ప్యాకెట్‌లో బయటపడిన రాళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విత్తన పంపిణీలో నాణ్యతకు తిలోదకాలు

నాసిరకం విత్తనం

అంటగడుతున్నారన్న ఆరోపణలు

ఆందోళన చెందుతున్న రైతులు

హిందూపురం, జూన 20: సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీలో నాణ్యతకు తిలోదకాలిచ్చారన్న విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఖరీఫ్‌ సీజనలో రైతులకు సబ్సిడీపై అందజేస్తున్న వేరుశనగ నాణ్యత డొల్లతనం బయటపడింది. ప్రభుత్వం, అధికారులు నాణ్యత ఉన్న విత్తనాలు అందజేస్తున్నామని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఏ ఆర్బీకేకైనా నాసిరకం విత్తనాలు వస్తే వెంటనే పరిశీలించి వెనక్కు పంపాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిస్తోంది. విత్తనం నాణ్యత లేదంటూ రైతులు వాపోతున్నారు. దీనినిబట్టి పైస్థాయి అధికారులు చెబుతున్న దానికి.. క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనలేదన్న విషయం తేటతెల్లమవుతోంది.

జిల్లాలో చాలామంది ఏడాదికి ఒకే పంట సాగు చేస్తున్నారు. అది కూడా వర్షాధారిత పంటే. కాలం కలిసొస్తే దిగుబడి.. లేదంటే పెట్టుబడి కూడా దక్కదు. ఇన్ని కష్టాలున్నా రైతులు ఏటా వేరుశనగ సాగు చేస్తున్నారు. ఈసారైనా ప్రభుత్వం నాణ్యమైన సబ్సిడీ విత్తనం అందిస్తుందని ఆశించారు. పెనుకొండలో మహిళా రైతు ఆందోళనతో నాణ్యత డొల్లతనం బహిర్గతమైంది. దీంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

నాసిరకం విత్తనమే..

నాణ్యత ఉన్న విత్తనాలు తీసుకెళ్లాలని అందరి సమక్షంలో అధికారులు చెబుతారు. ఆర్బీకేలకు వచ్చాక రైతులు వాటిని తీసుకెళ్లాల్సిందే. దీంతో చాలామంది రైతులు విత్తన వేరుశనగ నాణ్యతపై ఏమీ చెప్పలేకపోతున్నారు. వర్షాలు ప్రారంభం కాకపోవడంతో విత్తనాలు వేరుచేసే పనిలో ఇంకా రైతులు మందకొడిగా ఉన్నారని తెలుస్తోంది. జిల్లాలో 416 ఆర్బీకేల పరిధిలోని రైతులకు ఈ ఏడాది 1.9లక్షల విత్తనం అవసరమని అధికారులు నివేదికలు సమర్పించారు. ఇప్పటి వరకు 84,500 క్వింటాళ్లు ఆర్బీకేలకు చేరాయి. 37వేల క్వింటాళ్లకుపైగా పంపిణీ చేశారు.

ఆందోళన చెందుతున్న రైతులు

సోమందేపల్లి మండలానికి చెందిన మహిళా రైతు నాసిరకం విత్తనాలు అందజేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నిరసనకు దిగారు. ఈ తరుణంలో మిగిలిన ఆర్బీకేల్లో విత్తనం తీసుకెళ్లిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోరంట్ల, నంబులపూలకుంట రైతులు విత్తనం నాణ్యతగా లేదంటూ వెనక్కు పంపినట్లు తెలిసింది. ఇక్కడ విత్తన వేరుశనగ పంపిణీని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. ఆర్బీకేల్లో విత్తనం తీసుకెళ్లిన రైతులు నాణ్యతను ఇప్పుడిప్పుడే పరిశీలిస్తున్నారు. చాలామందికి నాసిరకం విత్తనాలు ఉన్నట్లు తెలుస్తోంది.

నాణ్యత లేకపోతే వెనక్కిచ్చేయండి..

ఎవరైనా రైతులు ఆర్బీకేల ద్వారా విత్తన వేరుశనగ కాయలు తీసుకెళ్లి ఉంటే వారికి నాణ్యత లేదని తెలిస్తే వెంటనే విత్తనాన్ని వెనక్కు ఇవ్వాలంటున్నారు. వేరుశనగ కాయలు ఆర్బీకేలకు వచ్చినప్పుడు నాణ్యత పరిశీలించి అక్కడే వెనక్కు ఇచ్చేయాలన్నారు. అయితే ఇప్పటి వరకు జిల్లాకు అందజేసిన విత్తన వేరుశనగ కాయలు నాణ్యతగా ఉన్నాయి. ఒకవేళ ఇంటికి తీసుకెళ్లినా నాణ్యత లేదని తెలిస్తే వాటిని వెనక్కు ఇచ్చేసేందుకు రైతులకు అవకాశం ఉందన్నారు.

- సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారి

Updated Date - 2023-06-21T00:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising