ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్యను.. గుండెపోటుగా చిత్రీకరించారు : గుండుమల

ABN, First Publish Date - 2023-04-30T23:54:18+05:30

రాజకీయంగా లబ్ధి పొందాలని సీఎం జగన తన బాబాయి వై ఎస్‌ వివేకానందరెడ్డి హత్యను.. గుండెపోటుగా చిత్రీకరించారని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేట ర్‌ గుండుమల తిప్పేస్వామి వి మర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిరటౌన, ఏప్రిల్‌ 30: రాజకీయంగా లబ్ధి పొందాలని సీఎం జగన తన బాబాయి వై ఎస్‌ వివేకానందరెడ్డి హత్యను.. గుండెపోటుగా చిత్రీకరించారని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేట ర్‌ గుండుమల తిప్పేస్వామి వి మర్శించారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో తండ్రి మరణాన్ని వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించింది జగనకాదా అని ప్రశ్నించారు. సొంత మీడియా సాక్షిలో వివేకా హత్యను గుండెపోటుగా ఎందుకు చూపించారని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసును సీ బీఐకి ఇవ్వాలని డిమాండ్‌ చేసి, తీరా అధికారంలోకి వచ్చాక వేసిన పిటీషనను ఉపసంహరించుకున్నారని అన్నారు. దేశంలో 20 మంది ముఖ్యమంత్రులకు ఉన్న ఆస్తులు ఒక్క జగనకే ఉన్నాయన్నారు. అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. రాజధాని మార్పు పేరుతో విశాఖపట్నంలో భూమాఫియాకు తెరతీశారన్నారు. అమరావతిలో వెయ్యి ఎకరాలకు పైగా భూమిని దారిమళ్లించారన్నారు. లిక్కర్‌, మైనింగ్‌ మాఫియాలకు వత్తాసుపలుకుతూ లబ్ధి పొందుతోంది జగనకాదా అంటూ ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో అసలైన నిందితులను సీబీఐ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-04-30T23:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising