రానున్న ఎన్నికల యుద్ధంలో తప్పక గెలుస్తాం
ABN, First Publish Date - 2023-06-10T00:02:03+05:30
‘రానున్న ఎన్నికల యుద్ధంలో మనం తప్పక గెలవాలి. పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తున్న మీముందు.. సర్వసైన్యాధ్యక్షుడిగా నేను నిలబడతా’ అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు.
కార్యకర్తలు విభేదాలు వీడి సమష్టిగా పనిచేయాలి
టీడీపీ నియోజకవర్గ చర్చా వేదికలో పరిటాల శ్రీరామ్
ధర్మవరం, జూన 9: ‘రానున్న ఎన్నికల యుద్ధంలో మనం తప్పక గెలవాలి. పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తున్న మీముందు.. సర్వసైన్యాధ్యక్షుడిగా నేను నిలబడతా’ అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ నియోజకవర్గ చర్చావేదిక నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ టీడీపీ గెలుపు కోసం సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. నేనూ కార్యకర్తనే... ఒకే కుటుంబంగా కలసి పనిచేద్దామన్నారు. సైకోలను తరిమికొడదామని తెలిపారు. అవమానాలు, వేధింపులను ఆయుధాలుగా మలచుకుని ఈ యుద్ధంలో పోరాడుదామని అభయమిచ్చారు. వైసీపీనేతల దుర్మార్గాలకు రోజులు దగ్గరపడ్డాయని, వారిని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహానాడు మేనిఫెస్టోతో టీడీపీ గెలుపు ఖాయమైందన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం చంద్రబాబు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమని ప్రశంసించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 2 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఏడాది రైతుకు రూ.20 వేల లబ్ధి, 18-59 సంవత్సరాల ప్రతి మహిళకు రూ.1500, అమ్మవందనం రూ.15వేలు వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని సూచించారు. ధర్మవరంలో కొందరు అఽధికార పార్టీ నాయకుల వసూళ్లను తిరిగి కట్టిస్తానన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మల్లికార్జున, అన్ని మండలాల టీడీపీ కన్వీనర్లు, క్లస్టర్ ఇనచార్జిలు, నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.
Updated Date - 2023-06-10T00:02:03+05:30 IST