ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగనన్నకాలనీల పేర్లు మారుస్తాం

ABN, First Publish Date - 2023-07-31T00:45:51+05:30

కొత్తచెరువు, జూలై 30: జనసేన పార్టీ అఽధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న కాలనీలకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను పెడతామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు.

జనసేన అధికారంలోకి రాగానే

స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెడతాం

ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి

కొత్తచెరువులోని జగనన్న కాలనీ సందర్శన

కొత్తచెరువు, జూలై 30: జనసేన పార్టీ అఽధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న కాలనీలకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను పెడతామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని పెనుకొండ రహదారి పక్కన ఉన్న జగనన్న కాలనీని ఆదివారం ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో సమస్యలపై అక్కడే ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ జగనన్న కాలనీలను కొండగుట్టలు, వంకల్లో ఏర్పాటు చేసి పేదలను ఇబ్బందుల పాలు చేశారని విమర్శించారు. కనీస వసతులు కూడా కల్పించలేదన్నారు. ఈ కాలనీకి ఇప్పటి వరకు రోడ్డు కూడా లేదని, రెవెన్యూ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కాలనీ కూడా పూర్తిగా నిర్మాణం కాలేదన్నారు. కేంద్రం ఇచ్చే రూ.1.50 లక్షకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.30వేలు కలిిపి ఇస్తోందని, కానీ సీఎం జగన అంతా తామే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జగన పాలనలో అరాచకాలు, మహిళలపైదాడులు అధికమయ్యాయని ఆరోపించారు. పేరుకే దిశా చట్టం ఉందని, ఎక్కడా వాటిని చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తిచంద్రశేఖర్‌, అబ్దుల్‌, కొత్తచెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల కన్వీనర్లు పూలశివ, తలారిపెద్దన్న, జయరాం, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-31T00:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising