ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి విజయానికి విస్తృత ప్రచారం
ABN, First Publish Date - 2023-03-07T23:58:27+05:30
పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ టీడీపీ మద్దతు అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విజయానికి టీడీపీ నాయకులు మంగళవారం జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు.
పెనుకొండ/మడకశిరటౌన/మడకశిరరూరల్/గుడిబండ, మార్చి 7: పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ టీడీపీ మద్దతు అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విజయానికి టీడీపీ నాయకులు మంగళవారం జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు. పెనుకొండ లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, టీడీపీ నాయకులు ప ట్టణంలోని పరిటాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాలుర హైస్కూల్, జూనియర్ కళాశాల, ప్రగతిగ్లోబల్‌జెన పాఠశాలల్లో ప్రచారం చేశా రు. ఉపాధ్యాయులు, పట్టభద్రులను కలిసి రాంగోపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మునిమడుగు వెంకటరాముడు, బొక్సంపల్లి రామక్రిష్ణప్ప, కేశవయ్య, కురుబ క్రిష్ణమూర్తి, రొద్దం నరసింహులు, గుట్టూరు సుబ్బరాయుడు, దారపునేని రామలింగ, రఘువీరచౌదరి, బోయనాగరాజు, ఆదిశేషు, సూర్యనారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, పోతిరెడ్డి, నాగప్ప, నాగేంద్ర, అశ్వర్థరెడ్డి, సానిపల్లి వెంకటేశ, రవి పాల్గొన్నారు. మడకశిరలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుం డుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. పశ్చిమ రా యలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌గోపాల్‌రెడ్డికి మద్దతుగా పట్టణంలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు. అనంత రం గుండుమల విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గా డిలో పడి, సంస్కరణలు రావాలంటే అనుభవం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమన్నారు. జగన ముఖ్యమంత్రి అ య్యాక రాష్ట్రంలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతితోనే వైసీపీ పాలన సాగుతోందని, ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావన్నారు. అదేవిధంగా మడకశిర మండలం ఆమిదాలగొంది, గౌడనహళ్ళి పంచాయతీలలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఈరన్న పర్యటించి, రాంగోపాల్‌రెడ్డి గెలుపుకోసం ప్రచారం చేశారు. ఉన్నత పాఠశాలలు, సచివాలయాల్లో పట్లుభద్రులను కలిసి. విలువైన ఓటు ను టీడీపీ మద్దతు అభ్యర్థికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వక్కలిగ సాఽధికార సమితి కన్వీనర్ పాండురంగప్ప, నాయకులు గోపాల్‌రెడ్డి, రమే్‌ష, కిష్టప్ప, చంద్రశేర్‌రెడ్డి పాల్గొన్నారు.
గుడిబండలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ మద్దతు అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డి విజయానికి ప్రతిఒక్కరు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మద్దనకుంటప్ప, నాయకులు లక్ష్మీన రసప్ప, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్, షబ్బీర్ పాల్గొన్నారు.
Updated Date - 2023-03-07T23:58:27+05:30 IST